సరసవచోవిలాస
4-974-చ.
సరసవచో విలాస! గుణసాగర! సాగర మేఖలా మహీ
భరణ ధురంధర! ప్రకట భవ్య భుజా భుజగేంద్ర! రాజశే
ఖర! ఖర దూషణ ప్రముఖ గాఢ తమః పటల ప్రచండ భా
స్కర! కఱకంఠ కార్ముక విఖండన ఖేలన! భక్త పాలనా!
చక్కటి మాటతీరు గలవాడ! సుగుణాల పోగా! చతుస్సాగర
పర్యంతం గల భూమండలము అంతటిని మిక్కిలి నేర్పుగా ఏలినవాడ! దివ్యమైన
మహాశక్తివంతమైన ఆదిశేషుని వంటి భుజబలము గలవాడ! రాజుశ్రేష్ఠుడ! ఖరుడు దూషణుడు
మున్నగు రాక్షసు లనే చిక్కటి చీకట్లను తీక్షణమైన సూర్యుని వలె అణచినవాడ! శివధనస్సును
విలాసంగా విరచినవాడ! భక్తులను రక్షించువాడ! శ్రీరామచంద్రప్రభు! నీకు
నమస్కారము.
4-974-cha.
sarasavachO
vilaasa! guNasaagara! saagara maekhalaa mahee
bharaNa
dhuraMdhara prakaTa bhavya bhujaa bhuja gaeMdra! raajaSae
khara! khara
dooshaNa pramukha gaaDha tama@h paTala prachaMDa bhaa
skara! kaRakaMTha
kaarmuka vikhaMDana khaelana! bhakta paalanaa!
సరసవచోవిలాస = రామచంద్ర {సరస వచో విలాస - సరస (మనోహరమైన) వచస్ (పలుకలతో) విలాస (శోభిల్లు వాడ),
రామ}; గుణ సాగర = రామచంద్ర {గుణ సాగర - సుగుణములకు సాగర (సముద్రము వంటివాడు), రాముడు}; సాగర మేఖలా మహీభరణ ధురంధర = రామచంద్ర {సాగర మేఖలా మహీ భరణ ధురంధర - సాగర (సముద్రములే) మేఖలా (సరిహద్దులుగా గల) మహీ
(భూమండలమును) భరణ (పాలించుట యందు) ధురంధర (మిక్కిలి నేర్పు గల వాడు), రాముడు}; ప్రకటభవ్య భుజా భుజగేంద్ర = రామచంద్ర {ప్రకట భవ్య భుజా భుజగేంద్ర - ప్రకట (ప్రసిద్ధ మైన) భవ్య (శుభ మైన) భుజ (భుజము లనెడి)
భుజగేంద్ర (గొప్పసర్పములు గలవాడు), రాముడు}; రాజశేఖర = రామచంద్ర {రాజశేఖర - రాజులలో (శ్రేష్టమైనవాడు), రాముడు}; ఖరదూషణప్రముఖగాఢతమఃపటలప్రచండభాస్కర = రామచంద్ర {ఖరదూషణప్రముఖగాఢతమఃపటలప్రచండభాస్కర - ఖర (వాడియైన, ఖరయనెడిరాక్షసుడు)
దూషణ (దూషించదగినది, దూషణుడు యనెడి రాక్షసుడు) ప్రముఖ
(మొదలగు) గాఢ (గాఢమైన) తమః (చీకట్ల) పటల (తెరలకు) ప్రచండ (భయంకరమైన) భాస్కర
(సూర్యునివంటివాడు), రాముడు}; కఱకంఠకార్ముక విఖండన ఖేలన = రామచంద్ర {కఱకంఠకార్ముక విఖండన
ఖేలన - కఱకంఠ (శివ) కార్ముక
(ధనుస్సును) విఖండన (విరిచుట యనెడి) ఖేలన (క్రీడ గలవాడు), రాముడు}; భక్తపాలనా = రామచంద్ర {భక్తపాలనా - భక్త (భక్తులను) పాలన (పరిపాలించెడివాడు),
రాముడు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment