ఆదిదేవుడైన
9-359-ఆ
ఆదిదేవుఁడైన యా రామచంద్రుని
కబ్ది గట్టు టెంత యసురకోటి
జంపు టెంత కపుల సాహాయ్య మది యెంత
సురల కొఱకుఁ గ్రీడ జూపెఁగాక.
ఆ పురాణ పురుషుడు అయినట్టి శ్రీరామచంద్రుడు
తలచుకుంటే సముద్రంమీద సేతువు కట్టడం, రాక్షసులు అందరిని చంపడం లాంటివి ఏమాత్రం పెద్ద
పనులేం కావు కాని, దేవతల కోసం తన లీలలను ప్రదర్శించాడంతే.
9-359-aa
aadidEvu@M Daina
yaa raamachaMdruni
kabdi gaTTu
TeMta yasurakOTi
jaMpu TeMta
kapula saahaayya madi yeMta
surala
koRraku@M greeDa joope@M gaaka.
ఆదిదేవుడు = మూలాధార /సృష్ట్ ఆది నుండి ఉన్న దేవుడు; ఐన = అయినట్టి; ఆ = ఆ; రామచంద్రుని = రామచంద్రుని; కిన్ = కి; అబ్ది = సముద్రమునకు; కట్టుట = సేతువు కట్టుట; ఎంత = ఎంతపాటి పని; అసుర = రాక్షస; కోటి = సమూహమును; చంపుట = సంహరించుట; ఎంత = అది ఎంత పని; కపుల = వానరుల; సాహాయ్యము = తోడు; అది = అది; ఎంత = ఎంతటిది; సురల = దేవతల; కొఱకున్ = కోసము; క్రీడ = లీలలు; చూపెన్ = చూపించెను; కాక = తప్పించి.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment