Monday, February 17, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 202

శ్రీకర

 

5.1-1-క.
శ్రీర! కరుణా సాగర!
ప్రాటలక్ష్మీ కళత్ర! వ్య చరిత్రా!
లోకాతీత! గుణాశ్రయ!
గోకులవిస్తార! నందగోపకుమారా!
     శుభములు కలిగించే వాడ! సముద్ర మంతటి విస్తారమైన కరుణ ప్రసరించే వాడ! ప్రసిద్దమగు శ్రీమహాలక్ష్మీదేవి గృహలక్ష్మిగా గలవాడా! పవిత్రమైన చరిత్ర కలవాడా! సర్వలోకులకు లోకాలకు అతీతమైన వాడ! త్రిగుణములకు ఆశ్రయం అయిన వాడ! గో సంపదలను విస్తరింపజేయు వాడ! నందగోపుని పుత్రుడా! శ్రీకృష్ణా! అవధరింపుము.
పోతన భాగవతంగా ప్రసిద్ధమై అందుబాటులో ఉన్న గ్రంధంలో బమ్మెర వారితోపాటు గంగన సింగయ మరియు నారయలు ముగ్గురు కూడ పాలుపంచుకున్నారు. గంగన మహాకవి పోతనామాత్యుని శిష్యుడు. పోతన లానే భక్తిప్రపత్తులతో ఆంధీకరించిన పంచమ స్కంధారంభంలో వాడిన వాసుదేవుని ప్రార్ధనా పద్యం ఇది.
5.1-1-ka.
Sreekara karuNaa saagara!
praakaTalakshmee kaLatra! bhavya charitraa!
lOkaateetaguNaaSraya!
gOkulavistaara! naMdagOpakumaaraa!
       శ్రీకర = శ్రీకృష్ణ {శ్రీకర - శుభకరమైనవాడ, శ్రీకృష్ణ}; కరుణాసాగర = శ్రీకృష్ణ {కరుణాసాగర - దయాసముద్రుడ, శ్రీకృష్ణ}; ప్రాకటలక్ష్మీకళత్ర = శ్రీకృష్ణ {ప్రాకటలక్ష్మీకళత్ర - ప్రాకట (ప్రసిద్ధమైన) లక్ష్మీదేవికి కళత్ర (భర్త), శ్రీకృష్ణ}; భవ్యచరిత్రా = శ్రీకృష్ణ {భవ్యచరిత్రా - దివ్యమైన వర్తనలుగలవాడ, శ్రీకృష్ణ}; లోకాతీత = శ్రీకృష్ణ {లోకాతీత - భువనములకు అతీతమైనవాడ, శ్రీకృష్ణ}; గుణాశ్రయ = శ్రీకృష్ణ {గుణాశ్రయ - త్రిగుణములకు ఆశ్రయమైనవాడ, శ్రీకృష్ణ}; గోకులవిస్తార = శ్రీకృష్ణ {గోకులవిస్తార - గోకులమునకు వృద్ధికారక, శ్రీకృష్ణ}; నందగోపకుమారా = శ్రీకృష్ణ {నందగోపకుమారా - నందుడనెడి గోపకుని పుత్రుడ, శ్రీకృష్ణ}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

2 comments:

gajula sridevi said...

అద్భుతంగా ఉందండీ రావుగారు .

vsrao5- said...

ధన్యవాదాలు +sridevi gajula గారు