ఎట్టెట్రా
10.1-1260-శా.
ఎట్టెట్రా? మనుజేంద్రు
చేలములు మీ కీఁబాడియే? మీరలుం
గట్టం బోలుదురే? పయోఘృతదధిగ్రాసంబులన్ మత్తులై
యిట్టాడం జనెఁగాక గొల్లలకు మీ కిట్టాడ
నోరాడెడిం;
గట్టా! ప్రాణముఁ గోలుపోయెదు సుమీ కంసోద్ధతిన్
బాలకా!
మధురకి
వచ్చిన శ్రీకృష్ణుడు ఎదురైన ఆస్థాన రజకుని నీ దగ్గరున్న మంచి బట్టలు ఇమ్మని అడిగారు.
ఆ రజకుడు కోపించి ఇలా అంటున్నాడు.- ఎలాగెలారా? కుర్రాడా! మహారాజు
బట్టలా? మీకివ్వచ్చుట్రా? ఇలాంటి బట్టలు మీరు కట్టగలరుట్రా? పాలు నెయ్యి
పెరుగులు మింగి తలకొవ్వి ఇలా కూశారుగాని. లేకపోతే గొల్లపిల్లలకు మీకు ఇలాంటి మాటలు
నోటికెలా వస్తాయి? అయ్యబాబోయ్! కంసమహారాజు గారి ఆగ్రహానికి ప్రాణాలు పోగొట్టుకుంటారురోయ్ ఓ
పిల్లాడా!
10.1-1260-shaa.
eTTeTraa?
manujEMdru chElamulu meekeeM~baaDiyE? meeraluM
gaTTaM
bOludurE? payOghRitadadhigraasaMbulan mattulai
yiTTaaDaM
janeM~gaaka gollalaku mee kiTTaaDa nOraaDeDiM;
gaTTaa!
praaNamuM~ gOlupOyedu sumee kaMsOddhatin baalakaa!
ఎట్టెట్రా = ఎలా గెలాగ; మనుజేంద్రు = రాజు యొక్క; చేలములున్ = బట్టలను; మీ = మీ; కున్ = కు; ఈన్ = ఇచ్చుట; పాడియే = ధర్మమా; మీరలున్ = మీరు మాత్రము; కట్టంబోలుదురే = కట్టుకొనగలరా; పయస్ = పాలు; ఘృత = నెయ్యి; దధి = పెరుగు; గ్రాసంబులన్ = తాగుటచేత; మత్తులు = మత్తెక్కినవారు; ఐ = అయ్యి; ఇట్లు = ఈ విధముగ; ఆడన్ = అనుట; చనెగాక = జరిగి యుండవచ్చును; గొల్లల్ = గోపకుల; కున్ = కు; మీ = మీ; కున్ = కి; ఇట్లు = ఈ విధముగ; నోరాడెడిన్ = నోళ్ళు తిరుగుతున్నాయి; కట్టా = అయ్య బాబోయ్; ప్రాణము = ప్రాణము; కోలుపోయెదు = పోతుంది; సుమీ = సుమా; కంస = కంసుడి యొక్క; ఉద్ధతిన్ = ఉద్వృత్తిచేత; బాలకా = పిల్లవాడా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment