ఉ.
ముద్దులుగార భాగవతమున్
రచియించుచు పంచదారలో
అద్దితివేమొ గంటము మహాకవిశేఖర! మధ్యమధ్య అ
ట్లద్దక వట్టి గంటమున నట్టిట్టు గీసిన తాటియాకులో
పద్దెములందు ఈ మధురభావము
లెచ్చటనుండి వచ్చురా!
- కరుణశ్రీ
కరుణశ్రీ గారు బహు ప్రసిద్ధమైన ఆధునిక
మహాకవి. పోతన భాగవతం ప్రజలలో పరివ్యాప్తి జరగటానికి వారు చేసిన అవిరళ కృషి
శ్లాఘనీయమైనది. తెలుగులో భాగవతం అనగానే పోతన పద్యాలు గుర్తువస్తాయి. అది సహజం.
కరుణశ్రీ పద్యాలు కూడ గుర్తొస్తాయి అది వారి విజ్ఞాన విశిష్ఠత. అట్టి వాటిలో
మొదటగా ఎన్నదగిన పద్యం ముద్దులుగార. పోతనవంటి మహాకవీశ్వరుని ఆసాంతం ఔపోసన పట్టి,
ఇలా అలతి పొలతి పదాలతో సామాన్య పాఠకుల మనసులు దోచటానికి అసామాన్య ప్రతిభ కావాలి.
పోతన కవిత్వం పంచదార పాకానికి
ప్రసిద్ధి. పోతనగారు ముద్దులొలికేలా అంత మథురాతి మధురంగా ఎలా రాయగలిగాడు అని
సందేహం వచ్చిందిట. ఆయనంటే కష్టపడి
తాటియాకులపై గంటంతో రాసారు. మహాకవి కదా, రవి గాంచని చోటే కాదు కాలం కాంచనిది కూడ
కనగలడు. తరువాతి తరాలలో సులువుగా కలం సిరాలో ముంచి రాసేవాళ్ళం కదా. పంచదార వాడి
మధుర పదార్థాలు చేసేవాళ్ళం కదా. అవన్నీ తెలిసిన వాడు కనుక పంచదారలో గంటం అద్ది తాటాకుల మీద
చెమటలు కాదు ముద్దులు కారేలా రాసారు. అలాకాకుండా వట్టి గంటంతో తాటాకులమీద అక్షరాలు
గీకేస్తే పద్యాలకి ఇంత మాధుర్యం రాదు కదా. అన్నారు మన కరుణశ్రీ. ఆ రోజుల్లో పంచదార ఎక్కడది అని అడక్కండి.
u
muddulugaara
bhaagavatamun rachiyiMchuchu paMchadaaralO
additivEmo
gaMTamu mahaakavishEkhara! madhyamadhya a
Tladdaka vaTTi
gaMTamuna naTTiTTu geesina taaTiyaakulO
paddemulaMdu ee
madhurabhaavamu lechchaTanuMDi vachchuraa!
ముద్దులుగార = మృదుత్వం ఉట్టిపడేలా; భాగవతమున్ = భాగవతమును; రచియించుచు = వ్రాసేటప్పుడు; పంచదార = పంచదార; లోన్ = అందు; అద్దితివేమొ
= అంటుకునేలా ముంచి; గంటము = గంటము (తాళపత్రాలపై వ్యాయుటకైన సాధనం); మహా = గొప్ప; కవి = కవులలో; శేఖర = విశిష్ఠ మైనవాడ; మధ్యమధ్య = ఆరాఆరా; అట్లు = ఆ విధంగా; అద్దక = అద్దకపోయినచో; వట్టి = ఉత్తి; గంటమునన్ = గంటంతో; అట్టిట్టు = అటు యిటు; గీసిన = వ్రాసినట్లైతే; తాటియాకు = తాళపత్రం; లోన్ = అందు; పద్దెములు = పద్యముల; అందు = లో; ఈ = ఇంతటి; మధురభావములు = చక్కటి బావాలు; ఎచ్చటనుండివచ్చురా = రావటానికి అవకాశం లేదు కదా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment