10.1-1021-సీ.
పూతన
యై యొక్క పొలఁతి చరింపంగ;
శౌరి యై యొక కాంత చన్నుగుడుచు;
బాలుఁడై యొక భామ పాలకు నేడ్చుచో;
బండి నేనను లేమఁ బాఱఁదన్ను;
సుడిగాలి నని యొక్క సుందరి గొనిపోవ;
హరి యని వర్తించు నబ్జముఖియు;
బకుఁడ నే నని యొక్క పడఁతి సంరంభింపఁ;
బద్మాక్షుఁడను కొమ్మ పరిభవించు;
శౌరి యై యొక కాంత చన్నుగుడుచు;
బాలుఁడై యొక భామ పాలకు నేడ్చుచో;
బండి నేనను లేమఁ బాఱఁదన్ను;
సుడిగాలి నని యొక్క సుందరి గొనిపోవ;
హరి యని వర్తించు నబ్జముఖియు;
బకుఁడ నే నని యొక్క పడఁతి సంరంభింపఁ;
బద్మాక్షుఁడను కొమ్మ పరిభవించు;
ఆ.
నెలమి
రామకృష్ణు లింతు లిద్దఱు గాఁగ
గోపవత్సగణము కొంద ఱగుదు
రసురవైరి ననుచు నబల యొక్కతె చీరుఁ
బసుల మనెడి సతుల భరతముఖ్య!
గోపవత్సగణము కొంద ఱగుదు
రసురవైరి ననుచు నబల యొక్కతె చీరుఁ
బసుల మనెడి సతుల భరతముఖ్య!
ఓ
భరతవంశ ప్రముఖుడైన పరీక్షిన్మహారాజా! ఒక గోపిక పూతన వలె నటిస్తుంటే, కృష్ణునిలా అభినయిస్తున్న ఇంకొక గోపిక
స్తన్యం తాగింది. మరొకామె పసిపిల్లాడిలా భావించుకొని పాలకేడుస్తూ, శకటాసురుడిని
అని మెలగుతున్న ఇంకో గోపికను కాలితో తన్నింది. మరింకొకామె నేను కృష్ణుణ్ణి అంటు
ఉన్నామెను తృణావర్తుడిలా ఎగరేసుకుపోయింది. ఇంకొకర్తె బకాసురుణ్ణి నేను అని
విజృంభించగా, ఆమెను మరొకర్తె నేను వాసుదేవుణ్ణి అంటు పరాభవించింది. ఇంతలో ఇద్దరు
ఇంతులు బలరామ కృష్ణులు కాగా, మరికొందరు మగువలు గోపకులు, దూడలు అయ్యారు. పశువులం
మేం అంటున్న పడతులను పద్మాక్షుడను అనే ఆమె పిలిచింది.
అంటూ
శుకుడు గోపికలు ఓపికలు లేక మెలగుతున్న తీరు పరీక్షిత్తునకు వివరిస్తున్నాడు.
కృష్ణవిరహంతో వేగిపోతున్న గోప వెలదులు కృష్ణ తాదాత్మ్యం చెంది కృష్ణలీలలను ఎలా
అనుకరిస్తున్నారో. ఎంత గాఢమైన భక్తో కదా వారిది. అంతటి తపన రగిలించాడానికే నేమో
పరమేశ్వరుడు రమించ గోరుతున్న వారి ఎదుట నుండి కనుమరుగైనాడేమో.
10.1-1021-see.
pootana yai yokka pola@Mti chariMpaMga
Sauri yai yoka kaaMta channuguDuchu;
baalu@MDai yoka bhaama paalaku naeDchuchO
baMDi nae nanu laema@M baaRa@Mdannu;
suDigaali nani yokka suMdari gonipOva;
hari yani vartiMchu nabjamukhiyu;
baku@MDa nae nani yokka paDa@Mti saMraMbhiMpa@M
badmaakshu@M Danu komma paribhaviMchu;
aa.
nelami raamakRshNu liMtu liddaRu gaa@Mga
gOpavatsagaNamu koMda Ragudu
rasuravairi nanuchu nabala yokkate cheeru@M
basula maneDi satula bharatamukhya!
పూతన = పూతన; ఐ = నేనై ఉన్నా ననుచు; ఒక్క
= ఒకానొక; పొలతి
= స్త్రీ; చరింపంగన్
= వర్తించుచుండగా; శౌరి
= కృష్ణుడను {శౌరి - శూరుని మనుమడు,
కృష్ణుడు}; ఐ = నేనై ఉన్నా ననుచు; ఒక్క
= ఒకానొక; కాంత
= స్త్రీ; చన్నుగుడుచు
= స్తన్యపానము చేయును; బాలుడు
= బాలకృష్ణుడను; ఐ = నేనై ఉన్నా ననుచు; ఒక = ఒకానొక; భామ
= స్త్రీ; పాలు
= పాలు; కున్ = కోసము; ఏడ్చుచున్
= రోదించుచుండగ; బండిన్
= బండిని; నేను
= నేనై ఉన్నాను; అను
= అనెడి; లేమన్ = స్త్రీని; పాఱదన్ను
= పడ దన్నును; సుడిగాలిని
= నేను సుడిగాలిని; అని
= అని; ఒక్క = ఒకానొక; సుందరి
= స్త్రీ; కొనిపోవ
= తీసుకుపోతుండగ; హరిన్
= నేను కృష్ణుడను; అని
= అని; వర్తించు = నటించును; అబ్జముఖియు
= స్త్రీ; బకుడన్
= బకాసురుని; నేను
= నేనై ఉన్నాను; అని
= అని; ఒక్క = ఒకానొక; పడతి
= స్త్రీ; సంరంభింప
= హడావిడిచేయగా; పద్మాక్షుడన్
= నేను కృష్ణుడను; అను
= అనెడి; కొమ్మ = స్త్రీ; పరిభవించున్
= పరాభవించును; ఎలమి
= పూని; రామ =
బలరాముడుగా; కృష్ణు
= కృష్ణుడుగా; ఇంతులు
= స్త్రీలు; ఇద్దరు
= ఇద్దరు (2); కాగన్
= వలె నటించుచుండగ; గోప
= గోపాలకులు; వత్స
= దూడలు; గణము = సమూహము; కొందఱు
= కొంతమంది; అగుదురు
= ఐ వర్తించెదరు; అసురవైరిని
= నేను కృష్ణుడను; అనుచు
= అని; అబల = స్త్రీ; ఒక్కతె
= ఒకానొక ఆమె; చీరున్
= పిలుచును; పసులము
= మేము పశువులము; అనెడి
= అను నట్టి; సతులన్
= స్త్రీలను; భరతముఖ్య
= పరీక్షిన్మహారాజా {భరతముఖ్యుడు - భరత వంశము నందలి
రాజులలో ముఖ్యుడు, పరీక్షిత్తు}.
~~~|సర్వేజనాః
సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment