Friday, October 3, 2014

మధురిమలు - ఖ్యాతి గడించుకొన్న

ఉ.
ఖ్యాతి గడించుకొన్న కవులందరు లేరె! అదేమి చిత్రమో
పోన యన్నచో కరిగిపోవు నెడంద, జొహారు సేతకై
చేతులు లేచు; ఈ జనవశీకరణాద్భుత శక్తి చూడగా
నాని పేరులో గలదొ! యన గంటములోన నున్నదో
- కరుణశ్రీ
          ప్రసిద్ధులైన మహాకవులు ఎందరో ఉన్నారు. కాని విచిత్రం ఏమిటంటే పోతన పేరు చెప్పగానే మనసు కరిగిపోతుంది, చేతులు రెండు నమస్కరించటానికి లేస్తాయి. ఇలా జనాల మనసులు దోచుకునే అద్భుత శక్తి అతని పేరులోనే ఉందో లేక గంటంలో ఉందో.
          కరుణశ్రీ గారికి పేరులో ఉందో పెన్నులో ఉందో మరి. పోతన అంటే పోతపోసిన పుణ్యాల రాశి, వారి గంట మేమో పంచదారలో అద్దినది. చూడగా యెలా విడదీసి చూడగల మా మథుర బందాన్ని.
u.
khyaati gaDiMchukonna kavulaMdaru lEre! adEmi chitramO
pOtana yannachO karigipOvu neDaMda, johaaru sEtakai
chEtulu lEchu; ee janavasheekaraNaadbhuta shakti chooDagaa
naatani pErulO galado! aayana gaMTamulOna nunnadO
          ఖ్యాతి = కీర్తి; గడించుకొన్న = సంపాదించుకున్న; కవులు = రచయితలు; అందరు = ఏంతో మంది; లేరె = ఉన్నారు కదా; అది = అది; ఏమి = ఎలాంటి ; చిత్రమో = విచిత్రమో కాని; పోతన = బమ్మెర పోతన పేరు; అన్నచోన్ = పలికితేచాలు; కరిగిపోవు = కరిగిపోతుంది; ఎడంద = మనస్సు; జొహారు = నమస్కారాలు; సేత = చేయటం; కై = కోసం; చేతులు = చేతులు రెండు; లేచు = పైకి లేస్తాయి; = ఇలాంటి; జన = జనాల; వశీకరణ = మనసు వశపరచుకొనే; అద్భుత = అద్భుతమైన; శక్తి = శక్తి; చూడగాన్ = తరచి చూసినా; ఆతని = పోతన గారి; పేరు = పేరు; లోన్ = అందు; కలదొ = ఉన్నదో; ఆయన = ఆయన; గంటము = రచనల; లోనన్ = అందు; ఉన్నదో = ఉన్నదో (తెలియటం లేదు) .
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: