Saturday, October 25, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 10.1-13-క. - విష్ణుకథారతు

10.1-13-క.
విష్ణు కథా రతుఁ డగు నరు
విష్ణుకథల్ చెప్పు నరుని వినుచుండు నరున్
విష్ణుకథా సంప్రశ్నము
విష్ణుపదీ జలము భంగి విమలులఁ జేయున్.
          పరీక్షిన్మహారాజా! శ్రీమన్నారాయణ పాదపద్మముల నుండి పుట్టిన పవిత్ర గంగానది వలెనే, విష్ణుకథాప్రసంగం కూడ విష్ణుకథల యందు ఆసక్తి కలవారిని, విష్ణు కథలు చెప్పేవారిని, వినేవారిని పునీతులను చేస్తుంది.
          అర్జునుడి పౌత్రుడైన పరీక్షిత్తునకు వ్యాసభగవానుని పుత్రుడైన శుకయోగి ఉపోద్ఘాతంగా విష్ణుకథల విశిష్టతని ఇలా వివరించారు.
10.1-13-ka.
vishNu kathaa ratu@M Dagu naru
vishNukathal cheppu naruni vinuchuMDu narun
vishNukathaa saMpraSnamu
vishNupadee jalamu bhaMgi vimalula@M jaeyun.
          విష్ణు = నారాయణుని; కథా = చరిత్రములను; రతుడు = వినుటం దాసక్తి కలవాడు; ఆగు = ఐన; నరున్ = మానవుని; విష్ణు = హరి యొక్క; కథల్ = వర్తనలను; చెప్పు = తెలియజెప్పెడి; నరుని = మానవుని; వినుచుండు = ఎప్పుడు వినెడి; నరున్ = మానవుని; విష్ణు = మాధవుని; కథ = కథలను; సంప్రశ్నము = చెప్పు మని యడుగుట; విష్ణుపదీ = గంగానదీ {విష్ణుపది - విష్ణుమూర్తి పాదములందు జనించినది, గంగ}; జలము = నీటి; భంగిన్ = వలె; విమలులన్ = నిర్మలులనుగా; చేయున్ = తయారుచేయును.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: