మ.
పదలాలిత్యము పాకశుద్ధి భగవత్భక్తాగ్ర సంసేవ్యమున్
పదమత్యున్నతమున్
మహాశుభదమున్ పద్మోద్భవానందమున్
చిదచిద్రూపవిభాగ భాగవతమున్ చింతింతు నాంధ్రంబుగా
సదయం జెప్పిన పోతరాజు
పదముల్ సత్ప్రేమ నే మ్రొక్కెదన్.
- చిదంబరకవి, అంగదరాయబారము
మన
తెలుగు భాగవతము పదలాలిత్యముతో తొణికిసలాడునది; చక్కటి పాకశుద్ధి కలది; భగవద్భక్త
శ్రేష్ఠులచే సేవింబడునది; మిక్కిలి
ఉన్నత స్థాయి కలది; గొప్ప శుభాలను అందించునది;
బ్రహ్మానందము కలిగించునది; చిత్తు అచిత్తు భేదము లను తెలుపునది. అట్టి తెలుగు
భాగవతమును సదా అధ్యయనం చేసుకొనెదను. తెలుగు వారిపై దయతో దానిని ఆంధ్రీకరించిన బమ్మెర
పోతన పాదములకు నేను నమస్కరిస్తాను. అని చిదంబర కవి అంగద రాయబారము రచనలో కీర్తించాడు.
http://telugubhagavatam.org/
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment