10.1-50-ఆ.
కొడుకు నీవు మరలఁ గొనిపొమ్ము వసుదేవ!
వెఱపు లేదు నాకు వీనివలన;
నల్గ వీనికి; భవ దష్టమపుత్రుండు
మృత్యు వఁట; వధింతు మీఁద నతని.
10.1-51-వ.
అనిన నానకదుందుభి నందనుం గొని చనియు నానందంబు నొందక, దుష్టస్వభావుండగు బావపలుకులు వినియు నులుకుచుండె; నంత
భావము:
“బావా! వసుదేవా! నీ కొడుకును తీసుకెళ్ళు. వీడి వలన నాకు భయం లేదు. నీ ఎనిమిదవ పుత్రుడే నా పాలిట మృత్యువట. వాడు పుట్టిన వెంటనే వధిస్తాను.” దుష్ట స్వభావం గల తన బావ కంసుడి మాటలు విని, కొడుకును ఇంటికి అయితే తీసుకెళ్ళాడు కానీ, పుట్టినప్పుడు దుందుభులు మ్రోగిన ఆ వసుదేవుడు, ఎప్పుడు ఏమౌతుందో అనే సందేహంతో ఉలికిపడుతూనే ఉన్నాడు. ఇంతలో . . . .
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=5&padyam=50
:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
No comments:
Post a Comment