( కల్కి అవతారము )
12-12-క.
మునినాథ! యే విధంబున
ఘనతరముగఁ జంద్ర సూర్య గ్రహముల జాడల్
సనుఁ? గాలవర్తనక్రమ
మొనరఁగ నెఱిఁగింపవయ్య ముదము దలిర్పన్.
భావము:
అప్పుడు పరీక్షిత్తు “మునివరా! చంద్రగ్రహం సూర్యగ్రహం సంచరించే మార్గాలు ఏవి? కాలవర్తన క్రమం ఏమిటి? నాకు చెప్తే సంతోషిస్తాను. నాకు చెప్తావా?” అని అడిగాడు
http://telugubhagavatam.org/?tebha&Skanda=12&Ghatta=3&padyam=12
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం : :
No comments:
Post a Comment