Sunday, January 6, 2019

శ్రీకృష్ణ లీలావిలాసం - 88

10.1-593-క.
శ్రీపతి పదమను నావను 
బ్రాపించి భవాబ్ధి వత్సపదముగ ధీరుల్
రూపించి దాఁటి చేరుదు
రాపత్పద రహితు లగుచు నమృతపదంబున్.
10.1-594-ఆ.
అఘునిఁ జంపి కృష్ణుఁ డాప్తులు దానును
జల్ది గుడిచి జలజసంభవునకుఁ
జిద్విలాసమైన చెలువుఁ జూపిన కథఁ
జదువ వినినఁ గోర్కి సంభవించు.


భావము:
బుద్ధిమంతు లైనవారు శ్రీహరి పాదము అనే నావను ఆధారంగా చేసుకుని సంసారం అనే సముద్రాన్ని, ఒక లేగదూడ అడుగును అంగవేసి దాటినంత తేలికగా దాటి ఆపద అనే స్థితిని పొందకుండా, అమృత స్థితిని చేరుకుంటారు. శ్రీ కృష్ణుడు అఘాసురుని సంహరించడం ఆప్తులైన గోపబాలుర తోకూడి చల్దిఅన్నం ఆరగించడం బ్రహ్మకు తానే అన్నిటి యందూ అన్ని రూపాలలో ఉండటం అనే తన లీలలు చూపడం మొదలుగా గల ఈ కధను ఎవరు చదివినా ఎవరు విన్నా వారు కోరిన కోరిక తీరుతుంది.”



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: