Saturday, January 26, 2019

శ్రీకృష్ణ లీలావిలాసం - 98


10.1-609-వ.
ఆ సమయంబున.
10.1-610-సీ.
అలసినచోఁ గొంద ఱతిమోదమున వీపు; 
లెక్కించుకొని పోదు రేపు మెఱసి; 
సొలసి నిద్రించినచోఁ నూరుతల్పంబు; 
లిడుదురు కొందఱు హితవు గలిగి; 
చెమరించి యున్నచోఁ జిగురుటాకులఁ గొంద; 
ఱొయ్యన విసరుదు రుత్సహించి; 
దవ్వేగి నిలుచుచోఁ దడయకఁ గొందఱు; 
పదము లొత్తుదు రతిబాంధవమున;
10.1-610.1-ఆ.
గోపవరులు మఱియుఁ గొందఱు ప్రియమున
మాధవునకుఁ బెక్కుమార్గములను
బనులు చేసిరెల్ల భవములఁ జేసిన
పాపసంచయములు భస్మములుగ.

భావము:
కృష్ణుడు అలసిపోతే కొందరుఅలా కృష్ణబాలుడు వనంలో విహరించే సమయాలలో... గోపబాలకులు చాల సంతోషంతో తమ వీపు మీద ఎక్కించుకుని తీసుకుని వెడతారు. కృష్ణుడు అలసి సొలసి నిద్రపోతే తమ ఒడిలోనే ఎంతో ఇష్టంగా పడుకోపెట్టుకుంటారు. కృష్ణుడికి చెమటలు పోస్తే చిగురుటాకులతో గాలి తగిలేలా వీస్తారు. కొంత దూరం నడచి అలసిపోతే కాళ్ళు నొప్పిపుట్టాయేమో నని పాదాలు వత్తుతారు ఇంకొందరు ప్రేమతో ఎన్నో విధాల సేవలు చేస్తారు. ఆ సేవలతో పూర్వజన్మలలో చేసిన వారి పాపాలన్నీ పటాపంచలు చేసుకున్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=78&padyam=610

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: