Tuesday, January 1, 2019

శ్రీకృష్ణ లీలావిలాసం - 86

10.1-590-క.
"కని మనిచి యెత్తి పెంచిన
తనుజన్ములకంటె నందతనయుం డా ఘో
షనివాసులకు మనోరం
జనుఁ డెట్లయ్యెను? బుధేంద్ర! చను నెఱిఁగింపన్."
10.1-591-వ.
అనిన శుకుం డిట్లనియె.


భావము:
“ఓ శుక మునీంద్రా! గోకులం లోని వారికి తాము కని పెంచిన తమ బిడ్డల కన్నా కృష్ణుడు ప్రేమపాత్రుడు ఎలా అయ్యాడు? నీవు జ్ఞానులలో శ్రేష్ఠుడవు ఇది వివరించడం నీకే సాధ్యపడుతుంది.” అలా అడిగిన పరీక్షన్మహారాజునకు శుకమహర్షి ఇలా చెప్పసాగాడు.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: