Monday, January 28, 2019

శ్రీకృష్ణ లీలావిలాసం - 101

10.1-615-వ.
అని పలికిన చెలికాని పలుకు లాదరించి విని నగి వారునుం దారును నుత్తాలంబగు తాలవనంబునకుం జని; యందు.
10.1-616-క.
తత్తఱమున బలభద్రుఁడు
తత్తాలానోకహములఁ దనభుజబలసం
పత్తిఁ గదల్చుచు గ్రక్కున
మత్తేభము భంగిఁ బండ్లు మహిపై రాల్చెన్.

భావము:
ఇలా చెప్పిన మిత్రుని మాటలు విని బలరామ కృష్ణులు చిరునవ్వుతో అంగీకరించారు. వారి తోపాటు ఆ తాటితోపులో ప్రవేశించారు. బలరాముడు తొందర తొందరగా ఆ తాటి చెట్లను పట్టుకుని తన భుజబలంతో మదించిన ఏనుగులా కదలించగానే మగ్గిన తాటిపండ్లు దబ దబ నేల మీద రాలాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=79&padyam=616

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: