9-324-వ.
ఇట్లొప్పుచున్న యప్పురంబు ప్రవేశించి, రాజమార్గంబున రామచంద్రు డరుగుచున్న సమయంబున.
9-325-మ.
ఇతఁడే రామనరేంద్రుఁ డీ యబలకా యింద్రారి ఖండించె న
ల్లతఁడే లక్ష్మణుఁ డాతఁడే కపివరుం డాపొంతవాఁడే మరు
త్సుతుఁ డా చెంగట నా విభీషణుఁ డటంచుంచేతులం జూపుచున్
సతులెల్లం బరికించి చూచిరి పురీసౌధాగ్రభాగంబులన్.
9-326-వ.
ఇట్లు సమస్తజనంబులు చూచుచుండ రామచంద్రుండు రాజమార్గంబునం జనిచని.
భావము:
ఇలా ముస్తాబయిన ఆ పట్టణం ప్రవేశించి రాజమార్గంలో శ్రీరాముడు వేంచేస్తున్న సమయంలో. నగరకాంతలు అందరూ భవనాలపైకెక్కి చూస్తూ, “ఇతనే రాజు రాముడు. ఇదిగో సీతా దేవి, రాముడు ఈమెకోసమే రావణుణ్ణి సంహరించాడు. అడిగో లక్ష్మణుడు, సుగ్రీవుడు అడిగో, ఆ పక్కవాడే ఆంజనేయుడు, ఆ పక్కన ఆ విభీషణుడు అని అంటూ చేతులు చాపి చూపి మరీ పరిశీలనగా చూడసాగారు. ఈ విధంగా ప్రజలు అందరూ చూస్తుండగా శ్రీరాముడు రాజమార్గంలో వెళ్లి...
http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=325
:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
No comments:
Post a Comment