9-307-వ.
ఇట్లు వచ్చి తమతమ నాథులం గని, శోకించి; రందు మండోదరి రావణుం జూచి యిట్లనియె.
9-308-ఉ.
హా! దనుజేంద్ర! హా! సురగణాంతక! హా! హృదయేశ! నిర్జరేం
ద్రాదుల గెల్చి నీవు కుసుమాస్త్రునికోలల కోర్వలేక సో
న్మాదముగన్ రఘుప్రవరుమానిని నేటికిఁ దెచ్చి? తప్పుడేఁ
గాదని చెప్పినన్ వినక కాలవశంబునఁ బొంది తక్కటా.
భావము:
ఇలా వచ్చిన ఆ రాక్షస కాంతలు వారివారి భర్తలను చూసి దుఃఖించారు, వారిలో మండోదరి రావణుని చూసి ఈ విధంగా పలికింది. “అయ్యో! ఓ రాక్షసరాజా! అయ్యో! హృదయేశ్వరా! దేవతల పాలిటి మృత్యుదేవతవు నీవు. దేవేంద్రాదులను జయించావు కాని మన్మథుని పూలబాణాలకు ఓర్వలేకపోయావు. చపలత్వంతో రాముడి భార్యను ఎందుకు తీసుకొచ్చావయ్యా? అయ్యయ్యో! వద్దు వద్దు అని ఎంత చెప్పినా వినకుండ మరణం పాలయ్యావు కదయ్యా.
:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
No comments:
Post a Comment