Friday, October 31, 2014

రుక్మిణీ కల్యాణ కథ - ధారావాహిక

ఓం నమో భగవతే వాసుదేవాయ
ఆ.
చ్చమైన యమృత మరులు త్రావినా
రోయి దాని కే నసూయ పడను
రమభక్తవరుడు మ్మెరపోతన
భాగవదమృతంబు పంచెగాన. 

          అన్నారట కవిసామ్రాట్ విశ్వనాథ సత్యన్నారాయణల వారు తమ రామాయణకల్పవృక్షం ప్రారంభమునందు. అంతటి మహాద్భుత గ్రంథ రాజ మైన మన తెలుగు భాగవతమునకు తలమానికము రుక్మిణీ కల్యాణం. ఇది పరమ పవిత్ర పారయణ గ్రంథము. మహా ప్రభావవంత మంత్ర పూరితము. ఎప్పటినుంచో శీఘ్ర కల్యాణ ఘడియలకోసం దీనిని ప్రయోగించేవారు. ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వర రావు గారి వంటి మహనీయులు ఎందరో ఈ విషయం అనేక మార్లు ఉద్ఘాటించారు. అటువంటి శ్రీ రుక్మిణీ కల్యాణ కథామృతాన్ని రేపటినుండి తెలుగుభాగవతం ధారావాహికంగా అందిస్తోంది. ఆస్వాదించండి.

 : : చదువుకుందా భాగవతం: బాగుపడదాం: మనం అందరం : :

No comments: