( రాజుల ఉత్పత్తి )
12-7-క.
గజ తురగాదిశ్రీలను
నిజ మని నమ్మంగరాదు; నిత్యమును హరిన్
గజిబిజి లేక తలంచిన
సుజనులకును నతనియందుఁ జొరఁగా వచ్చున్.
భావము:
గుఱ్ఱములు ఏనుగులు వంటి సంపదలను శాశ్వతమని నమ్మరాదు. ప్రశాంత హృదయంతో నిరంతరం హరిని స్మరించే సజ్జనులు అతని యందే చేరుతారు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=12&Ghatta=2&padyam=7
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం : :
No comments:
Post a Comment