( చంద్ర సూర్య పితృ మార్గంబు )
3-1020-సీ.
అట్టి సర్వేశ్వరుం డయ్యయి కాలంబు;
లందును దద్గుణ వ్యతికరమున
జనియించు చుండు నీ చాడ్పున ఋషిదేవ;
గణములు దమతమ కర్మనిర్మి
తైశ్వర్య పారమేష్ఠ్యము లందుఁ బురుషత్వ;
మునఁబొంది యధికారములు వహించి
వర్తించి క్రమ్మఱ వత్తురు మఱికొంద;
ఱారూఢకర్మానుసార మైన
3-1020.1-తే.
మనములను జాల గలిగి ధర్మముల యందు
శ్రద్ధతోఁ గూడి యప్రతిసిద్ధమైన
నిత్యనైమిత్తికాచార నిపుణు లగుచుఁ
దగి రజోగుణ కలిత చిత్తములు గలిగి.
భావము:
అటువంటి సర్వేశ్వరుడు ఆయా సమయాలలో తన మహనీయ గుణగణాల కలయికచే అనేక రూపాలలో అవతరిస్తూ ఉంటాడు. ఈ విధంగా అతని అంశలు పంచుకొని పుట్టిన ఋషులు, దేవతలు తమ కర్మఫలాన్ని అనుసరించి పౌరుషంతో ఐశ్వర్యం, పారమేష్ఠ్యం మొదలైన అధికారాలు చేపట్టి కొంతకాలం అనుభవించి, యథాస్థానానికి తిరిగి వస్తారు. మరికొందరు కర్మానుసారమైన మనస్సు కలవారై, ధర్మమందు శ్రద్ధ కలవారై, ధర్మానికి విరుద్ధం కాకుండునట్లుగా, నిత్యమూ తాము చేయదగిన ఆచారాలను నిర్వర్తిస్తూ, రజోగుణంతో నిండిన మనస్సు కలవారై...
http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=54&padyam=1020
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments:
Post a Comment