Monday, May 29, 2017

దక్ష యాగము - 47:


4-114-క.
"తన కూఁతులు చూడఁగ నిజ
తనయను సతి ననపరాధఁ దగవఱి యిట్లె
గ్గొనరించిన యీ దక్షుని
ఘనపాప విపాక మిదియుఁ గాఁదగు ననుచున్."
4-115-వ.
వెండియు నిట్లనిరి "కుపితాత్ముండైన దక్షుండు దన కూఁతుతో విరోధంబు చాలక జగత్సంహార కారణుం డయిన రుద్రునిం గ్రోధింప జేసె; అమ్మహాత్ముం డెంతటివాఁ డన్నం బ్రళయకాలంబున

టీకా:
తన = తనయొక్క; కూతులు = పుత్రికలు; చూడగన్ = చూస్తుండగ; నిజ = తనయొక్క; తనయను = పుత్రికను; సతిన్ = సతీదేవిని; అనపరాధన్ = అపరాధములేనిది; తగవఱి = న్యాయముతప్పి; ఇట్లు = ఈవిధముగ; ఎగ్గు = అవమానము; ఒనరించిన = చేసిన; ఈ = ఈ; దక్షునిన్ = దక్షుని యొక్క; ఘన = అత్యధికమైన; పాప = పాపముయొక్క; విపాకము = గట్టిఫలము; కాదగు = అయ్యుండవచ్చు; అనుచున్ = అంటూ. వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈవిధముగ; అనిరి = పలికిరి; కుపిత = కోపముతో కూడిన; ఆత్ముండు = మనసు కలవాడు; ఐన = అయిన; దక్షుండు = దక్షుడు; తన = తనయొక్క; కూతున్ = కూతురు; తోన్ = తోటి; విరోధంబున్ = శతృత్వము; చాలక = సరిపోక; జగత్ = భువనము యొక్క; సంహార = లయమునకు; కారణుండు = కారణభూతుడు; అయిన = అయిన; రుద్రునిన్ = శివుని; క్రోధింపన్ = కోపించునట్లు; చేసెన్ = చేసెను; ఆ = ఆ; మహాత్ముండు = గొప్పవాడు; ఎంతటివాడు = ఎంతవాడు; అన్నన్ = అనగా; ప్రళయ = విలయ; కాలంబునన్ = సమయములో.

భావము:
“ఈ విధంగా తన కుమార్తెలు చూస్తుండగా ఏ అపరాధమూ ఎరుగని తన కూతురు సతీదేవిని అన్యాయంగా అవమానించిన ఈ దక్షుని మహాపాపానికి ఫలితం ఈ ధూళి అయి ఉంటుంది” అంటూ... ఇంకా ఇలా అన్నారు “దక్షుడు కోపంతో తన కుమార్తెతో వైరం తెచ్చుకొనడమే కాక ప్రళయకారకుడైన రుద్రునకు కోపం తెప్పించాడు. మహాత్ముడైన ఆ శివుడు ఎంతటివాడంటే ప్రళయకాలంలో...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=7&Padyam=114

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: