(భక్తి యోగం)
3-970-వ.
అట్టివాని.
3-971-క.
కని సకలభూతగణములు
మనమున నానందజలధిమగ్నము లగుచున్
ఘన బహుమాన పురస్సర
మనయముఁ బాటిల్ల వినుతు లర్థిం జేయున్.
భావము:
(అటువంటి పుణ్యాత్ముని) సమస్త ప్రాణికోటి ఎంతో గౌరవభావంతో చూచి, ఎప్పుడూ అభినందిస్తూ సంతోష సముద్రంలో మునిగి తేలుతుంటారు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=971
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments:
Post a Comment