10.1-378-వ.
అని మర్మంబు లెత్తి పలికి.
10.1-379-క.
ఆ లలన గట్టె ఱోలన్
లీలన్ నవనీతచౌర్యలీలుం బ్రియ వా
గ్జాలుం బరివిస్మిత గో
పాలున్ ముక్తాలలామ ఫాలున్ బాలున్.
భావము:
ఇలా యశోద అవతార రహస్యాలు ఎత్తుకుంటూ దొంగకృష్ణుని ఎత్తిపొడిచి, అతనిని ఒక రోలుకి కట్టేసింది. ఆ దుడుకు పిల్లాడు వెన్నదొంగిలించటమనే క్రీడ కలవాడు, సంతోషాలు పంచుతూ గలగలా మాట్లాడు వాడు. తల్లి తనను కట్టిసినందుకు ఆశ్చర్యపోతున్నట్లు కనబడుతున్న గొల్లపిల్లాడు. ముత్తెపుబొట్టు నుదుట అలంకారంగా మెరుస్తున్న వాడు.
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments:
Post a Comment