9-362-ఆ.
రామచంద్రుఁ గూడి రాకలఁ పోకలఁ
గదిసి తిరుగువారుఁ గన్నవారు
నంటికొన్నవారు నా కోసలప్రజ
లరిగి రాదియోగు లరుగు గతికి.
9-363-క.
మంతనములు సద్గతులకుఁ
బొంతనములు ఘనములైన పుణ్యముల కిదా
నీంతనపూర్వమహాఘ ని
కృంతనములు రామనామ కృతి చింతనముల్.
భావము:
శ్రీరామునితో కలిసిమెలసి మెలగిన వారు; తనివితీరా చూసిన వారు; ప్రేమతో తాకిన వారు అయిన ఆ కోసల ప్రజలు ఆదియోగులు పొందే సద్గతిని పొందారు. శ్రీరామచంద్రమూర్తిని గుఱించి చేసెడు తలపులు సద్గతులు కలిగించే ఏకాంతమార్గములు, గొప్ప పుణ్యాలు కలిగిస్తాయి. పూర్వజన్మలలోను , యీ జన్మలోను చేసిన పాపాలను తొలగిస్తాయి. అవి మహిమాన్వితములు.
:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
No comments:
Post a Comment