9-350-వ.
అంతఁ గొంతకాలంబునకు రామచంద్రుని కొమారులయిన కుశ లవులిద్దఱను వాల్మీకివలన వేదాదివిద్యల యందు నేర్పరులై పెక్కు సభల సతానంబుగా రామకథాశ్లోకంబులు పాడుచు నొక్కనాఁడు రాఘవేంద్రుని యజ్ఞశాలకుం జని.
9-351-మత్త.
వట్టి మ్రాకులు పల్లవింప నవారియై మధుధార దా
నుట్టఁబాడిన వారిపాటకు నుర్వరాధిపుఁడుం బ్రజల్
బిట్టు సంతస మంది; రయ్యెడఁ బ్రీతిఁ గన్నుల బాష్పముల్
దొట్ట నౌఁదల లూఁచి వారలతోడి మక్కువ పుట్టఁగాన్.
భావము:
అంతట కొన్నాళ్ళకు శ్రీరాముని పుత్రులు ఐన కుశుడు లవుడు ఇద్దరు వాల్మీకి వల్ల వేదాది విద్యలలో ఆరితేరారు. అనేక సభలలో స్వరసహితముగా శ్రీరామకథా శ్లోకాలు పాడుతూ ఉన్నారు. ఆ క్రమంలో ఒక దినం శ్రీరాముని యాగశాలకు వెళ్ళి.. ఆ విధంగా శ్రీరాముని యాగసాలలో ఎండిన మోళ్ళు చిగురించేలా, అమృత ధారలు జాలువారేలా పాడరు. వారి పాటను మహారాజు, ప్రజలు అందరూ తలలూపుతూ, ఆనందభాష్పాలు కారుతుండగా మిక్కిలి సంతోషించారు. అప్పుడు, వారిపై ఎక్కువ మక్కువ కలిగింది.
http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=23&padyam=351
:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
No comments:
Post a Comment