Saturday, December 23, 2017

ద్వారక అస్తమయం - 8

11-13-క.
వచ్చిన మునిసంఘములకు
విచ్చలవిడి నర్ఘ్యపాద్యవిధు లొనరింపన్‌
మెచ్చగు కనకాసనముల 
నచ్చుగఁ గూర్చుండి వనరుహాక్షునితోడన్‌.
11-14-క.
"జనములు నిను సేవింపని
దినములు వ్యర్థంబు లగుచుఁ దిరుగుచు నుండుం
దనువులు నిలుకడ గావఁట
వనములలో నున్ననైన వనరుహనాభా!


భావము:
అలా వచ్చిన శ్రీకృష్ణుడు మునులకు ఆర్ఘ్యం పాద్యం మొదలైన మర్యాదలు విస్తృతంగా చేసాడు. అటుపిమ్మట వారు మేలిమి బంగారు ఆసనాల మీద ఆసీనులై పద్మనేత్రుడైన కృష్ణుడితో ఇలా అన్నారు.
“పద్మనాభా! నిను సేవించని దినములు సర్వం మానవులకు ప్రయోజన శూన్యములు; అడవులలో ఉన్నా దేహాలకు నిలుకడలు లేనివి.:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
No comments: