Saturday, December 2, 2017

పోతన రామాయణం - 50

9-352-వ.
అంతనా రామచంద్రుండు కుమారుల కిట్లనియె.
9-353-ఆ.
"చిన్నయన్నలార! శీతాంశుముఖులార! 
నళినదళవిశాలనయనులార! 
మధురభాషులార! మహిమీఁద నెవ్వరు
దల్లిదండ్రి మీకు ధన్యులార? "


భావము:
అప్పుడు శ్రీరాముడు పిల్లలతో ఇలా అన్నాడు. ఓ చిన్ని బాబులు! మీ మోములు చంద్రబింబాల్లా ప్రకాశిస్తున్నాయి. మీ కన్నులు కలువరేకులలా వెడల్పుగా అందంగా ఉన్నాయి. మీ పలుకు మధురంగా ఉన్నాయి. లోకంలో మీలాంటి వారి తల్లిదండ్రులు ధన్యులు; మీ తల్లిదండ్రులు ఎవరు నాయనలారా? 
– అని మర్యాదకు మారుపేరైన శ్రీరామచంద్రమూర్తి తన యజ్ఞశాలకి వచ్చి రామకథ గానం చేస్తున్న కుశలవులను ప్రశ్నించాడు. పోతనగారి పాత్రౌచిత్య, సందర్భౌచిత్యమైన లలిత పదాలు, నడక లాలిత్యం ఈ మృదు మధురమైన పద్యంలో ప్రతిఫలిస్తున్నాయి.


http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=23&padyam=353


:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




No comments: