9-270-ఉ.
ఆ యసురేశ్వరుండు వడి నంబరవీథి నిలాతనూజ న
న్యాయము చేసి నిష్కరుణుఁడై కొనిపోవఁగ నడ్డమైన ఘో
రాయతహేతిఁ ద్రుంచె నసహాయత రామనరేంద్రకార్యద
త్తాయువుఁ బక్షవేగపరిహాసితవాయువు నజ్జటాయువున్.
9-271-వ.
అంతనా రామచంద్రుండు లక్ష్మణసహితుండై, సీత వెదక నరుదెంచి, నిజకార్యనిహతుండైన జటాయువునకుఁ పరలోకక్రియలు గావించి, ఋశ్యమూకంబునకుం జని.
భావము:
దయావిహీనుడైన రాక్షసరాజు అలా మోసం చేసి వేగంగా ఆకాశ మార్గాన సీతను తీసుకుపోతుంటే, రామకార్యం కోసం ఆయుస్సు త్యాగంచేసినది, వాయువేగాన్ని మించిన వేగం గలది అయిన జటాయువు అడ్డగించింది. నిస్సహాయురాలైన ఆ జటాయువును భయంకరమైన పెద్ద ఆయుధంతో రావణుడు సంహరించాడు. అప్పుడు, సీతాన్వెషణకై వచ్చిన రామలక్ష్మణులు, రామకార్యంలో ప్రాణాలు త్యజించిన ఆ జటాయువునకు, అంత్యక్రియలు చేసి, ఋశ్యమూకపర్వతానికి వెళ్ళారు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=271
:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
No comments:
Post a Comment