9-265-క.
దశరథుఁడు మున్ను గైకకు
వశుఁడై తానిచ్చి నట్టి వరము కతన వా
గ్దశ చెడక యడివి కనిచెను
దశముఖముఖకమలతుహినధామున్ రామున్.
9-266-క.
జనకుఁడు పనిచిన మేలని
జనకజయును లక్ష్మణుండు సంసేవింపన్
జనపతి రాముఁడు విడిచెను
జనపాలారాధ్య ద్విషదసాధ్య నయోధ్యన్.
భావము:
దశరథుడు ఇంతకు ముందు తాను కైకకు ఇచ్చిన వరాలకు కట్టుబడి రావణుని ముఖ కమలాలకు చంద్రునివంటి వాడైన శ్రీరాముడిని అడవికి పంపించాడు. అయోధ్య రాజులచే పూజినీయమైనది. శత్రువులకు సాధింపరానిది. అట్టి అయోధ్యను తండ్రి ఆఙ్ఞను శిరసావహించి సీతాదేవి, లక్ష్మణుడు తనను సేవిస్తుండగా శ్రీరాముడు వదిలి పెట్టెను.
http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=266
:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
No comments:
Post a Comment