Monday, October 9, 2017

పోతన రామాయణం - 13

9-280-వ.
కని తనకుఁ ద్రోవ యిమ్మని వేఁడిన నదియు మార్గంబు చూపక మిన్నందిన నా రాచపట్టి రెట్టించిన కోపంబున.
9-281-క.
మెల్లని నగవున నయనము
లల్లార్చి శరంబు విల్లు నందిన మాత్రన్
గుల్లలు నాఁచులుఁ జిప్పలుఁ
బెల్లలునై జలధి పెద్ద బీడై యుండెన్.


భావము:
అలా సముద్రాన్ని చూసి తనకు దారి ఇవ్వమని కోరాడు. కాని సముద్రుడు దారి ఇవ్వకపోవడంతో, ఆ రాముడి కోపం పెరిగిపోయింది. చిరునవ్వుతో కళ్ళు చలింపజేసి ధనుర్బాణాలు తీసుకొన్న మాత్రంచేతనే సాగరం ఇగిరిపోయి; నత్తగుల్లలు, నాచులు, ఆల్చిప్పలు, మట్టపెళ్ళలు బైటపడి బీడుపడినట్లు మారిపోయింది.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




No comments: