ఇవాళ ఎంతో శుభదినం. మా నల్లనయ్య
కృపాకటాక్షాల వల్ల బహుళ శాస్త్ర పారంగత శ్రేష్ఠులు శ్రీ అహోబిలవఝ్ఝల మురళి గారితో
సంభాషించే అదృష్టం లభించింది. వారు చెప్పిన ఒక అసాధారణ ధారణ గల వ్యక్తి చరిత్ర
మీతో పంచుకుంటా. . . .
జగన్నాథపండితరాయలు అని సంస్కృత పండితుడు
కోనసీమలో ఉండేవారుట. ఈయన ఉత్రరదేశయాత్రకి బయలుదేరి వెళ్తున్నారుట. అవి ఢిల్లీని పాదుషాలు
పాలిస్తున్న రోజులు. ఆ రోజుల్లో అందరు సామాన్యంగా కాలినడకన వెళ్ళేవారు కదా అలానే
వారు వెళ్తున్నారు. అలా అక్కడ నడుస్తుండగా బాగా ఎండగా ఉందని ఒక చెట్టు కింద ఆగారు.
ఆ పక్కనే ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. అలా ఆ గొడవ పాదుషా దర్బారుకి వెళ్ళింది.
ప్రత్యక్ష సాక్షులు ఎవరేనా ఉన్నారా అంటే. ఒక బ్రాహ్మణుడు చెట్టు కింద ఉన్నాడు అని
చెప్పారు. రౌతులు గుర్రాలమీద వెళ్ళి వీరిని పట్టుకొని పాదుషా ఎదుట హాజరు పరచారు.
అరబ్బీ పారశీకాలు కలిసిన అప్పటి వాడుక భాషలో రైతులు దెబ్బలాడుకున్నారు. వీరికి
మాతృ భాష తెలుగు పండిత భాష సంస్కృతం వచ్చు కాని ఆ భాష రాదు. అదే విషయం వివరించి,
భాష రాకపోయిన వారు మాట్లాడుకున్న శబ్దాలు యధాతథంగా అప్పజెప్పారు. ఆహా ఏం
ధారణాశక్తి, ఏం ఙ్ఞాపకశక్తి.
ఆ మహా పండితుడు పిమ్మట ముస్లిం స్త్రీ
లవంగిని వివాహమాడారు, అనేక గొప్ప రచనలు రాశారట.
ఏకాసంథాగ్రాహి అని ఒక్కొక్కళ్ళు ఉంటా రని
విన్నా కాని, ఇంత గొప్ప ఙ్ఞాపక శక్తి, ధారణ వినటం కాదు ఊహించను కూడ ఊహించ లేదు.
మరి వీరి ఐక్యూ ఎలా లెక్కపెట్టాలో?
No comments:
Post a Comment