Thursday, July 18, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_1

శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో
ద్రేస్తంభకుఁ గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్.
        సర్వలోకాలను రక్షించేవానిని, భక్తజనులను కాపాడుటలో అత్యుత్సాహం గలవానిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవానిని, విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండాలు సృజించే వానిని, మహాత్ముడైన నందుని అంగన యొక్క కుమారుని (మహానందం దేహంగా గల ఆత్మీయుని) ముక్తిమార్గాన్ని అందుకోడానికి సదాస్మరిస్తు ఉంటాను. (బమ్మెర పోతనామాత్యుల ఈ ప్రార్థన తన మోక్షానికా ప్రజల మోక్షానికా ?) 
1-1-శా. | శ్రీకైవల్యపదంబుఁజేరుటకునై - శ్రీ = శుభకరమైన; కైవల్య = ముక్తి; పదంబున్ = స్థితిని; చేరుట = పొందుట; కున్ = కోసము; = ; చింతించెదన్ - చింతించు = ప్రార్థించు; ఎదన్ = ఎదన్; లోకరక్షైకారంభకు - లోక = లోకాలన్నిటిని; రక్ష = రక్షించుటనే; ఏక = ముఖ్యమైన; ఆరంభ = సంకల్పమున్న వాడు; కున్ = కి; భక్తపాలనకళాసంరంభకున్ - భక్త = భక్తులను; పాలన = పాలించే; కళా = కళయందు; సంరంభ = వేగిరపాటున్న వాడు; కున్ = కిన్; దానవోద్రేకస్తంభకుఁగేళిలోలవిలసదృగ్జాలసంభూత నానాకంజాత భవాండ కుంభకు - దానవ = రాక్షసుల; ఉద్రేక = ఉద్రేకమును; స్తంభ = మ్రాన్పడేలా చేసేవాడు; కున్ = కి; కేళి = ఆటలందు; లోల = వినోదాలందు; విలసత్ = ప్రకాశించే; దృక్ = చూపుల; జాల = వలనుండి; సంభూత = పుట్టిన; నానా = వివిధ; కంజాతభవాండ = బ్రహ్మాండముల {కంజాతభవాండ - కం (నీటిలో) జాత (పుట్టినదాని, (పద్మం) లోపుట్టినవాని(బ్రహ్మ) అండము, బ్రహ్మాండము}; కుంభ = రాశితనలో కలిగిన వాడు; కున్ = కి; మహానందాంగనాడింభకున్ - మహా = గొప్ప; నంద = నందుని; అంగనా = భార్యయొక్క; డింభ = కొడుకు; కున్ = కున్.
1-2-ఉ.#

వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్ దయా

శాలికి శూలికిన్ శిఖరిజా ముఖ పద్మ మయూఖ మాలికిన్
బా శశాంక మౌళికిఁగ పాలికి మన్మథ గర్వ పర్వతో
న్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాలికిన్.
ఆపరాని తాండవ మాడేవానికి, మిక్కలి దయగలవానికి, పార్వతి యొక్క ముఖ పద్మం పాలిటి సూర్యునికి, శిరస్సున ధరించిన చంద్రరేఖ గల వానికి, కపాలధారికి, మన్మథుడి మహాగర్వాన్ని అణిచేసిన వానికి, నారదాది మునుల మానస సరోవరాలలో విహరించేవానికి తగిలిన భక్తితో మొక్కుతాను.
1-2-ఉ. | వాలిన = అతిశయించిన; భక్తి = భక్తితో; మ్రొక్కెదనవారితతాండవకేళికిన్ - మ్రొక్కెదన్ = మ్రొక్కెదను; అవారిత = వారింపలేని; తాండవ = తాండవమనే; కేళి = ఆట ఆడే వాని; కిన్ = కి; దయాశాలికి - దయాశాలి = దయకలవాడి; కిన్ = కి; శూలికిన్ - శూలి = శూల ధారి; కిన్ = కి; శిఖరిజాముఖపద్మమయూఖమాలికిన్ - శిఖరి = పర్వతుని; జా = పుత్రికయొక్క; ముఖ = ముఖము అనే; పద్మ = పద్మానికి; మయూఖమాలి = సూర్యుడు {మయూఖమాలి - కిరణములు కలవాడు, సూర్యుడు}; కిన్ = కి; బాలశశాంకమౌళికిఁగపాలికి - బాల = లేత; శశాంక = చంద్రుని {శశాంక - శశ (కుందేలు) గుర్తు కలవాడు - చంద్రుడు}; మౌళి = శిరస్సున ధరించిన వాడు; కిన్ = కి; కపాలి = పుర్రె ధరించే వాడు; కిన్ = కి; మన్మథగర్వపర్వతోన్మూలికి - మన్మథ = మన్మథుని; గర్వ = గర్వమనే; పర్వత = పర్వతాన్ని; ఉన్మూలి = నిర్మూలించిన వాడు; కిన్ = కి; నారదాదిమునిముఖ్య - నారద = నారదుడు; ఆది = మొదలైన; ముని = ముని; ముఖ్య = ముఖ్యుల; మనస్సరసీరుహాలికిన్ - మనస్ = మనసులనే; సరసీరుహ = పద్మాలలోని {సరసీరుహ - సరస్సులో పుట్టినది, పద్యం; అలి = తుమ్మెద లాంటి వాడు; కిన్ = కి.  

2 comments:

Anonymous said...

>>(బమ్మెర పోతనామాత్యుల ఈ ప్రార్థన తన మోక్షానికా ప్రజల మోక్షానికా ?)

ఈ పద్యం చదివే అందరికీను. ఇంత మంచి పద్యం పొస్ట్ చేసి ఇలాంటి వెధవ ప్రశ్నలు అడుగుతారేమిటండీ? మీరు కానీ టి.వి 9 ని పని చేస్తున్నారా?

vsrao5- said...

ధన్యవాదాలు అఙ్ఞాత గారు,