11-88-క.
నారాయణు వచనముల క
పారంబగు సమ్మదమున బలములతోడన్
దార సుత మిత్ర యుతులై
వారణ హయ సమితితోడ వడి నేఁగి రొగిన్.
11-89-వ.
అంత.
11-90-క.
జ్ఞానమున నుద్ధవుఁడు దన
మానసమున నెఱిఁగి శ్రీరమాధిప! హరి! యో
దీనజనకల్పభూజ! సు
ధీనాయక! మాకు నీవె దిక్కని పొగడెన్.
భావము:
శ్రీకృష్ణుని మాటలు వినిన యాదవులు అందరూ మిక్కిలి సంతోషంతో భార్యా బిడ్డలతో, మిత్రులతో కలసి ఏనుగులు గుఱ్ఱాలు సైన్యాలు తీసుకుని వెంటనే బయలుదేరి ప్రభాసతీర్థానికి వెళ్ళారు. అప్పుడు ఉద్ధవుడు తనకు ఉన్న జ్ఞానంతో ఈ విషయం అంతా గ్రహించి, “లక్ష్మీవల్లభా! శ్రీహరీ! దీనల పాలిటి కల్పవృక్షమా! బుద్ధిమంతులలో శ్రేష్ఠుడవు అయిన నీవే మాకు దిక్కు” అని స్తుతించాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=16&Padyam=89
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : : ..
No comments:
Post a Comment