10.1-623-క.
బలకృష్ణులపైఁ గవిసిన
బలియుర ఖరదైత్యభటులఁ బశ్చిమపాదం
బుల బట్టి తాల శిఖరం
బుల కెగురఁగ వైచి వారు పొరిగొని రధిపా!
10.1-624-వ.
అప్పుడు.
భావము:
ఆ బలరామకృష్ణులు తమ పైకి వచ్చిన ఆ రాకాసి గాడిదలను వెనుక కాళ్ళు పట్టుకుని గిర గిరా త్రిప్పి తాడిచెట్ల తలలపైకి విసిరికొట్టి మట్టుపెట్టారు. అప్పుడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=79&padyam=623
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments:
Post a Comment