12-మే-2013న mothers day అట. తల్లి ఎక్కడైనే ఏదేశమైన ఎప్పుడైనా
ఎవరికైనా పూజనీయురాలే కదా. అందుకే ఈ పాశ్చాత్య సంప్రదాయం ఐన mothers day రోజున నా మాతృదేవతని ప్రత్యేకంగా తలచుకుంటు, మాతృమూర్తులు
అందరికి ఇవే నా ప్రణామాలు, శుభాకాంక్షలు.
ఈ సందర్భంగా మన బమ్మెర పోతనామాత్యుల వారు తన తల్లిని ఎలా పరిచయం
చేసారో గుర్తు చేసుకుందాము. ఆ మహాతల్లి అనవసర విషయాలకి బయటకు వెళ్ళదుట. భర్త మాట జవదాటదుట.
పరుల విషయం తలచుకోదుట. దానధర్మాలు వదలదుట. ఆమె పలుకు సున్నితమైనది, గంభీరమైనది, చక్కటిది అట.
ఆమెకు సాటి రాగల మానినులు లేరట. అదే వారి పలుకలలో. . . . . .
1-25-క. నడవదు నిలయము వెలువడి
తడవదు పరపురుషు గుణముఁ దన పతి నుడువుం
గడవదు వితరణ కరుణలు
విడువదు లక్కాంబ విబుధ విసరము వొగడన్.
1-26-ఉ. మానిను లీడు గారు బహుమాన నివారిత దీన మానస
గ్లానికి, దాన
ధర్మ మతి గౌరవ మంజు లతా గభీరతా
స్థానికి, ముద్దుసానికి,
సదాశివ పాద యుగార్చ నానుకం
పానయ వాగ్భవానికిని, బమ్మెర కేసయ లక్కసానికిన్.
No comments:
Post a Comment