Thursday, July 29, 2010

షష్ఠ స్కంధము

షష్ఠ స్కంధము దస్త్రముల కట్టను అంతర్జాలములో అప్లోడు చేసితిని. లింకు అనుక్రమణిక యందు చూపితిని. గమనించగలరు.
మరియు 6 వ స్కంధము పాటము, ప్రతి పదార్థములను స్క్రిబ్ద్.కం (scribd.com)లో పెట్టిలిని.

1 comment:

చింతా రామ కృష్ణా రావు. said...

ఆర్యా! నమస్తే.

ఊల పల్లి వంశ మొప్పారఁ బుట్టిన
సాంబ శివుఁడ! మీదు సహజ గుణము
తెలిసెనయ్య మాకు. దీపించె దైవాంశ.
మిమ్ముఁ జూడ; మీ గుణమ్ముఁ జూడ.

ఎంతటి భక్తితో కవులనేకులు భక్తిగ భాగవతమ్మునే
సంతస మందుచున్ చదివె! చక్కని సత్ కవితా విధానమున్
పంతము తోడ నేర్చె. కడు భక్తిగ మీరును వ్రాయఁ బూనినన్
వంతులు పూని చేరు మిము భక్తిగ నేనును నేను నేననన్.

వ్రాయగఁ బూనుడయ్యా! శుభ భావ పరంపర చేరు మిమ్ము; సత్
ధ్యేయముఁ గల్గి యుండినను దేవుని సత్ కృప యుండ కుండునే?
వ్రాయగ నేర్చిరే పరమ భాగవతమ్మును భక్తి యుక్తులై!
వ్రాయగ రాదొకో తమరు భవ్య మహోజ్వల కావ్య ఖండికన్?

మీరు శ్రమించి పంపినందులకు ధన్యవాదములు.