కవిసార్వభౌములవారు సహజకవీశ్వరులు బమ్మెఱ పోతనామాత్యులవారికి ఆంధ్రీకరించిన
భాగవతము ఎటులున్నదో వర్ణిస్తున్నారట
మూలమునలేనియీ యందచందములు మరెవ్వరి గంటములందు నింతగా రూపొందలేదే! వరాలకు
నెత్తుకెత్తుగా నా చక్కఁ దనాల పద్యములు వ్రాయుటకు నీవే తగుదువయ్యా! ఎన్ని పోకడలు
పోయితివి! ఎంత చక్కఁగ నూహించితివి! ఎంత రసవత్తరముగఁ జెప్పితివి మహాకవీ!
సీ.
భీష్మునిపైకి
కుప్పించి లంఘించు
గో
పాలకృష్ణుని
కుండలాలకాంతి
కరిరాజు
మొరపెట్ట పఱువెత్తు కరివేల్పు
ముడివీడి
మూపుపై బడిన జుట్టు
సమరమ్ము
గావించు సత్య కన్నులనుండి
వెడలు ప్రేమక్రోధ వీక్షణములు
కొసరి
సల్దులు మెక్కు గొల్ల పిల్లల వ్రేళ్ళ
సందు మాగాయ పచ్చడి పసందు
తే.
ఎటుల కనుగొంటివయ్య! నీ కెవరు చెప్పి
రయ్య! ఏరాత్రి కలగంటి వయ్య! రంగు
కుంచెతో దిద్ది తీర్చి చిత్రించినావు!
సహజ పాండితి కిది నిదర్శనమటయ్య
సస్యశ్యామలములగు సుందరక్షేత్రములలో విహరించుచు సర్వాంగ సుందరమగు
నీభాగవతమహాగ్రంథమును వెలయించినావు. నన్నయతిక్కనాదులు భాగవతమును తెలిఁగింపక
విడిచినది నీ కోసమే కాఁబోలు. ఈ మహాకార్యముచే నీవు ధన్యుఁడవైతివి. తెలుఁగుతల్లి
ధన్యురాలైనది"
~ కరుణశ్రీ