Monday, January 1, 2018

ద్వారక అస్తమయం - 15

11-25-క.
ధరణీసురశాపమునకు
హరిహర బ్రహ్మాదులైన నడ్డము గలరే? 
నరు లనఁగ నెంత వారలు
గర మరుదుగఁ బూర్వజన్మకర్మముఁ ద్రోవన్‌?


భావము:
బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు అంతటి వారు సైతం బ్రాహ్మణ శాపాన్ని అడ్డుకోలేరు. ఇక సామాన్య మనుషులనగా ఎంత? పూర్వజన్మ కర్మ ఫలాన్ని తొలగించుటం ఎవరికి సాధ్యం కాదు కదా.:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
No comments: