కంటిగంటి
10.2-1152-మత్త.
“కంటిగంటి భవాబ్ధి
దాఁటఁగఁ గంటి ముక్తినిధానముం
గంటి నీ కరుణావలోకముఁ గంటి బాపము వీడ ము
క్కంటి తామరచూలియుం బొడఁగాన నట్టి మహాత్మ! నా
యింటికిం జనుదెంచి తీశ్వర! యేఁ గృతార్థతఁ బొందితిన్.
10.2-1152-matta.
“kaMTigaMTi bhavaabdhi daa@MTa@Mga@M gaMTi muktinidhaanamuM
gaMTi nee karuNaavalOkamu@M gaMTi baapamu veeDa mu
kkaMTi taamarachooliyuM boDa@Mgaana naTTi mahaatma! naa
yiMTikiM janudeMchi teeSvara! yae@M gRtaarthata@M boMditin^.
బలి తన లోకానికి వచ్చిన శ్రీకృష్ణుని ఇలా స్తుతించాడు:- శ్రీకృష్ణభగవానుడా! ఓ మహాత్మా! నీవు నా మందిరానికి విచ్చేశావు. పరమ శివుడు బ్రహ్మదేవుడు
సైతం కానరాని నిన్ను నేను దర్శించ గలిగాను. నేను ధన్యుణ్ణి అయ్యాను. సంసార సాగరాన్ని
దాట గలిగాను. మోక్షమార్గాన్ని అందుకో గలిగాను. నా పాపం అంతా అంతరించి పోయింది.
కంటిగంటి = చూడ గలిగితిని; భ వాబ్ధి - భవ = సంసారము అను; అబ్దిన్ = సముద్రమును; దాఁటఁగఁ గంటి - దాటగన్ = తరించుటను; కంటిన్ = ఎరిగితిని; ముక్తి నిధానముం గంటి - ముక్తి = మోక్షమునకు; నిధానమున్ = నిధి వంటి దానిని; కంటిన్ = కనుగొంటిని; నీ = నీ యొక్క; కరుణావలోకముఁ గంటి బాపము - కరుణా = దయాపూరిత; అవలోకమున్ = చూపులను; కంటి = పొందితిని; పాపము = పాపములు; వీడ - వీడన్ = తొలగిపోగా; ముక్కంటి = శివుడు; తామరచూలియుం బొడఁగాన నట్టి
– తామరచూలియున్ = బ్రహ్మదేవుడు; పొడగానన్ = చూడజాలని; అట్టి = అటువంటి; మహాత్మ - మహాత్మా = గొప్పవాడ; నా = నా; యింటికిం జనుదెంచి తీశ్వర - ఇంటి = గృహమున; కిన్ = కు; చనుదెంచితి = వచ్చితివి; ఈశ్వర = భగవంతుడా; యేఁ గృతార్థతఁ బొందితిన్ - ఏన్ = నేను; కృతార్థుతన్ = ధన్యుతను; పొందితిన్ = పొందాను.
తెలుగుభాగవతం.కం http://www.telugubhagavatam.com/ || ఓం నమో భగవతే వాసుదేవాయః ||
గొప్ప పద్యం గుగొప్ప పద్యం గుర్తుచేశారు.దయచేసి వర్డ్ వెరిఫికేషన్ తీసెయ్యండి.
ReplyDeleteఈ పద్యంలో పోతనగారు కంటిగంటి అన్నారు. ఒకేమాట రెండు సార్లు ప్రయోగించారు, దాని అర్థం కంటితో చూశాను అనికాని, చూశాను, చూశాను అని కాని చెప్పుకోవచ్చా! వివరించగలరు. fiedA
ReplyDeleteMeeru goppa yagnam chesaru, e grandhanni online lo petti, mimmulanu bhagavantudu challaga chudu gaka.
ReplyDelete+Hari, kastephali గార్లకు అనేక ధన్యవాదాలు. మన తెలుగుభాగవతం.ఆర్గ్ http://telugubhagavatam.org/ జాలిక ఆవిష్కరణ పనిలో ఆలస్యం చేసా క్షంతవ్యుడను.
ReplyDeleteవర్డ వెరిఫికేషన్ గూగులు వాళ్ళిచ్చింది. మెషిన్ కాదని నిర్ధారించు కోడానికి అనుకుంటా. అయినా మీరు అఙ్ఞాత గా కూడ రాయొచ్చండి. లేదా జి+లో కాని ఫేస్ బుక్ లో కాని చూసి నాకు మైలు ఇవ్వచ్చు. కష్టే ఫలి గారు. మీ వర్ఢ్ ప్రెస్ చూసా చాలా బాగుంది. కాని అక్కడ వ్యక్తీకరిద్దా మంటే. సైన్ అప్ అంటున్నారు. అది నాకు ఇష్టం లేదు.