Monday, July 29, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_10

10.1-34-మత్త.
వావిఁ జెల్లెలు గాని పుత్రికవంటి దుత్తమురాలు; సం 
భావనీయచరిత్ర; భీరువు; బాల; నూత్నవివాహ సు 
శ్రీవిలాసిని; దీన; కంపితచిత్త; నీ కిదె మ్రొక్కెదన్; 
కావవే; కరుణామయాత్మక; కంస! మానవవల్లభా!” 
Vavin jellelu gani putrika vamti duttamuralu; sam 
Bhavaniya caritra; bhiruvu; bala; nutnavivaha su 
Srivilasini; dina; kampitacitta; ni kide mrokkedan; 
Kavave; karunamayatmaka! Kamsa! Manava vallabha! 
కంసుడు ఆకాశవాణి పలుకులు విని చెల్లి దేవకిని చంపబోతుంటే. వసుదేవుడు అతనిని శాంత పరచే సందర్భంలో దీ పద్యం. 
కంసమహారాజా! దయామయా! ఈమె నీకు వరసకు చెల్లెలే కాని,  కూతురు లాంటిది. ఉత్తమురాలు. గౌరవించదగిన నడవడిక గలామె. అసలే భయస్తురాలు. అందులో చిన్నవయస్సుపిల్ల. కొత్తపెళ్ళికూతురు. చక్కని లక్ష్మీకళలతో విలసిల్లుతున్నది. దీనురాలు భయంతో లోలోన వణికిపోతున్నది. ఇదిగో నేను నీకు చేతులెత్తి మొక్కుతున్నాను. ఈమెను రక్షించు. 
వావిఁజెల్లెలుగాని - వావిన్ = వరుసకు; చెల్లెలు = చెల్లెలు; కాని = కాని; పుత్రిక వంటి దుత్తమురాలు - పుత్రిక = కూతురు; వంటిది = లాంటిది; ఉత్తమురాలు = మంచి యామె; సంభావనీయ చరిత్ర - సంభావనీయ = గౌరవింపదగిన; చరిత్ర = నడవడిక గలామె; భీరువు = భయస్తురాలు; బాల = చిన్నపిల్ల; నూత్న వివాహ సుశ్రీవిలాసిని - నూత్నవివాహ = కొత్తపెళ్ళికూతురుగా; సు = మేలైన; శ్రీ = కాంతి యొక్క; విలాసిని = విలాసవతి; దీన = దీనురాలు; కంపిత చిత్త - కంపిత = చలించిన; చిత్త = మనస్సుకలామె; నీ కిదె - నీ = నీ; కున్ = కు; ఇదె = ఇదిగో; మ్రొక్కెదన్ = నమస్కరించెదను; కావవే = కాపాడుము; కరుణా మయాత్మక - కరుణామయ = దయగల; ఆత్మక = మనసు కలవాడ; కంస = కంసుడా; మానవవల్లభా = రాజా.
  తెలుగుభాగవతం.కం  http://www.telugubhagavatam.com/

 || ఓం నమో భగవతే వాసుదేవాయః ||

Sunday, July 28, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_9


10.1-26-ఉ.
                   “అన్నవు నీవు చెల్లెలికి; నక్కట! మాడలు చీర లిచ్చుటో?
                   మన్నన చేయుటో? మధుర మంజుల భాషల నాదరించుటో?
                  ‘మిన్నుల మ్రోతలే నిజము, మే’లని చంపకు మన్న మాని రా
                   వన్న! సహింపు మన్న! తగ దన్న! వధింపకు మన్న! వేడెదన్.
10.1-26-u. 
“annavu niivu chelleliki; nakkata ! mAdalu chiira lichchutO?
Mannana cheEyutO? maDHura maMjula Bhaashala naadhariMchutO?
‘Minnula mrOthalE nijamu, mE’ lani chaMpaku manna mAni rA
Vanna ! sahiMpu m exianna ! thaga dhanna ! vaDhiMpaku manna ! vEdedhan.

కంసుడు ఆకాశవాణి పలుకులు విని చెల్లి దేవకిని చంపబోతుంటే. వసుదేవుడు అతనిని శాంత పరచే సందర్భంలో దీపద్యం. 
           బావ! ఈ అబల చెల్లెలు నువ్వు అన్నవు కదా! ధనం, బట్టలు లాంటి  బహుమతు లివ్వాలి. ఆడబడచు అంటు గౌరవించాలి.  మృదు వైన మాటలతో ఆదరించాలి కదయ్య. అంతేగాని, అయ్యో! ఇదేం టయ్య? గాలి మాటలే నిజ మని నమ్మి ఈ అమాయకురాలిని వధించబతున్నావు. ఆమెని వదలి పెట్టు. ఓర్పు వహించు. ఈ పని నీకు తగదయ్య. వేడుకుం టున్నాను ఈమెను చంపకయ్య.
             అన్నవు = జ్యేష్టభ్రాతవు; నీవు - నీవున్ = నీవు; చెల్లెలికి నక్కట - చెల్లెలి = ఆడబడుచున; కిన్ = కి; అక్కట = అయ్యో; మాడలు = బంగారు బిళ్ళలు; చీర లిచ్చుటో - చీరలు = కోకలు; ఇచ్చుటో = ఇవ్వడం కాని; మన్నన = గౌరవించుట; చేయుటో = చేయటం కాని; మధుర = తియ్యని; మంజుల = మృదు వైన; భాషల నాదరించుటో - భాషలన్ = మాటలతో; ఆదరించుటో = ఆదరించుటకాని అంతేకాని; మిన్నుల = ఆకాశ; మ్రోతలే = పలుకులే; నిజము = సత్యములు; మే లని - మేలు = సరియైనవి; అని = అనుకొని; చంపకు మన్న - చంపకు = సంహరింపకము; అన్న = అయ్య; మాని = ప్రయత్నము విరమించి; రావన్న - రావు = వెనుకకు రమ్ము; అన్న = అయ్య; సహింపు మన్న - సహింపుము = ఓర్పు వహించుము; అన్న = తండ్రి; తగ దన్న - తగదు = తగినపని కాదు; అన్న = నాయనా; వధింపకు మన్న - వధింపకుము = చంపకుము; అన్న = అయ్య; వేడెదన్ - వేడెదన్ = ప్రార్థించు చుంటిని.
  తెలుగుభాగవతం.కం  http://www.telugubhagavatam.com/

 || ఓం నమో భగవతే వాసుదేవాయః ||