Friday, March 10, 2017

కాళియమర్దనము – మమ్ముఁబెండ్లి చేయు

:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం అందరం:


10.1-689-ఆ.
మ్ముఁబెండ్లి చేయు మా ప్రాణవల్లభు
ప్రాణమిచ్చి కావు క్తవరద!
నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు
పిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు.
10.1-690-ఇం.
నీయా; యెవ్వారిని నిగ్రహింపం
డా యుగ్ర పాపాకృతి నంద డింకన్;
నీ యాజ్ఞలో నుండెడు నేఁటఁగోలెన్
మా యీశు ప్రాణంబులు మాకు నీవే."

టీకా:
మమ్మున్ = మమ్ములను; పెండ్లిచేయుము = పెళ్ళిచేయుము, కూర్చుము; మా = మా యొక్క; ప్రాణవల్లభు = భర్త యొక్క; ప్రాణమున్ = ప్రాణమును; ఇచ్చి = ఇచ్చి; కావు = కాపాడుము; భక్తవరద = కృష్ణా {భక్తవరదుడు - భక్తుల కోరికలు తీర్చువాడు, విష్ణువు}; నీవు = నీవు; చేయు = చేసెడి; పెండ్లి = పెళ్ళి, శుభము; నిత్యంబు = శాశ్వతమైనది; భద్రంబు = మేలైనది; పిన్ననాటి = మా చిన్నప్పటి; పెండ్లి = పెళ్శి; పెళ్ళి = పెళ్ళి అని చెప్పదగినది; కాదు = కాదు.
నీ = నీమీద; ఆన = ఒట్టు; ఎవ్వారిని = ఎవరిని; నిగ్రహింపడు = బాధింపడు; ఆ = మునుపటి; ఉగ్ర = భయంకరమైన; పాప = పాపరూపమైన; ఆకృతిన్ = ఆకారమును; అందడు = చెందడు; ఇంకన్ = ఇకపైన; నీ = నీవు పెట్టెడి; ఆజ్ఞన్ = ఆజ్ఞకు; లోన్ = లోబడి; ఉండెడున్ = ఉండగలడు; నేట = ఇవాళ్టి; గోలెన్ = నుంచి; మా = మా యొక్క; ఈశు = భర్త; ప్రాణంబులున్ = ప్రాణములను; మా = మా; కున్ = కు; ఈవే = ఇమ్ము.

భావము:
భక్తులకు వరాలిచ్చే మహానుభావ! శ్రీకృష్ణ! మా ప్రాణప్రియుడైన కాళీయుడి ప్రాణాలు ప్రసాదించి, అతనితో మాకు కల్యాణం చేయించు. చిన్నప్పుడు జరిగిన మా పెళ్ళి కల్యాణం కాదు. ఇప్పుడు నీవు మాకు చేసేదే కల్యాణం శాశ్వతంగా ఉండేదీ, క్షేమకరమైనదీ.
నీ మీద ఒట్టు; ఈ కాళియుడు ఇంకెవ్వరిని బాధపెట్టడు; ఇంకెప్పటికి భయంకరమైన పాపిష్టి రూపమెత్తడు; ఇవేళ్టి నుంచి నువ్వు చెప్పినట్లే నడచుకుంటాడు; మా భర్త ప్రాణాలను మాకు ప్రసాదించవయ్యా స్వామీ!.”

No comments: