Monday, October 10, 2016

హరిహరసల్లాపాది - ఘనతన్

8-388-మ.
తన్ నీ మగపోఁడుముల్ పలుమఱుం న్నారఁ గన్నార; మే
నిను విన్నారము చూడమెన్నఁడును మున్ నీయాఁడుఁజందంబు మో
హినివై దైత్యులఁ గన్నుఁ బ్రామి యమృతం బింద్రాది దేవాళి కి
చ్ఛి నీ రూపముఁ జూపుమా! కుతుకముం జిత్తంబునం బుట్టెడిన్.
8-389-క.
వాఁడ వై జగంబులఁ
గిలిఁచి చిక్కులను బెట్టు దంటకు నీకున్
గువ తనంబున జగములఁ
గులము బొందింప నెంతడవు ముకుందా! "
8-390-వ.
అని పలుకుచున్న శూలపాణిచే నపేక్షితుండై విష్ణుండు భావ గంభీరంబగు నవ్వు నివ్వటిల్ల న వ్వామదేవున కిట్లనియె.
టీకా:
            అని = అని; పలుకుచున్న = అడుగుతున్న; శూలపాణి = శంకరుని; చేన్ = వలన; అపేక్షితుండు = కోరబడినవాడు; ఐ = అయ్యి; విష్ణుండు = విష్ణుమూర్తి; భావగంభీరంబు = భావగర్భం, రహస్యార్థం; అగు = కాన్; నవ్వు = నవ్వు; నివ్వటిల్లన్ = అతిశయించగా; ఆ = ఆ; వామదేవున్ = శంకరున; కున్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
            ఘనతన్ = గొప్పతనమును; నీ = నీ యొక్క; మగ = పురుష రూపు; పోడుముల్ = చక్కదనములు; పలు = అనేక; మఱున్ = సార్లు; కన్నారము = చూసితిమి; కన్నారన్ = కంటినిండుగా; మే = మేము; నినున్ = నీగురించి; విన్నారము = వినియున్నాము; చూడము = చూడలేదు; ఎన్నడునున్ = ఎప్పుడుకూడ; మున్ = ఇంతకుపూర్వము; నీ = నీ యొక్క; ఆడు = ఆడురూపపు; చందంబున్ = చక్కదనములను; మోహినివి = జగన్మోహినీరూపివి; ఐ = అయ్యి; దైత్యుల = రాక్షసుల; కన్నున్ = కళ్ళు; ప్రామి = కప్పి; అమృతంబున్ = అమృతమును; ఇంద్ర = ఇంద్రుడు; ఆది = మున్నగు; దేవ = దేవతా; అళి = సమూహమున; కున్ = కు; ఇచ్చిన = సమకూర్చినట్టి; నీ = నీ యొక్క; రూపమున్ = స్వరూపమును; చూపుమా = చూపెట్టుము; కుతుకమున్ = కుతూహలము; చిత్తంబునన్ = మనసునందు; పుట్టెడిన్ = కలుగుచున్నది.
            మగవాడవు = పురుష రూపుడవు; ఐ = అయ్యి; జగంబులన్ = లోకమును; తగిలిచి = తగులములుకలిగించి; చిక్కులను = ఇబ్బందులను; పెట్టుదు = పెట్టెదవు; అంట = అంతటివాడి; కున్ = కి; నీ = నీ; కున్ = కు; మగువ = స్త్రీ; తనంబునన్ = ఆకృతితో; జగములన్ = లోకములను; తగులమున్ = మోహమునందు; పొందింపన్ = చెందించుటకు; ఎంత = ఏమి; తడవు = తడబాటు; ముకుందా = హరి.
భావము:
            మాధవా! మహిమతో కూడిన నీమగసోయగాన్ని పెక్కుసార్లు కన్నాము. విన్నాము. నీఆడరూపాన్ని ఏనాడూ చూడలేదు. మోహినిగా నీవు రాక్షసులను మోసగించి ఇంద్రాది దేవతలకు అమృతాన్ని పంచిఇచ్చిన ఆరూపాన్ని చూపించు. దాన్ని చూడాలని, నామనసు కుతూహలపడుతున్నది.
            ముకుందా! మగవాడిగా మోహంలో పడవేసి నీవు లోకాలను ఎన్నో చిక్కులకు గురిచేస్తావుట. అటువంటి నీవు ఆడరూపంలో లోకాలను ఆకర్షించడంలో ఆశ్చర్యం ఏముంది.”
            పైవిధంగా పలుకుతున్న పరమేశ్వరుని మాటలకు గంభీరంగా నవ్వుతూ విష్ణువు ఇలా అన్నాడు.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: