Friday, September 23, 2016

క్షీరసాగరమథనం – చెలికాని పాటుఁ

అష్టమ స్కంధముజంభాసురుని వృత్తాంతము
8-359-క.
చెలికాని పాటుఁ గనుఁగొని
లి సఖుఁడగు జంభుఁ డతుల బాహాశక్తిం
జెలితనము చాల నెఱపుచు
నిలునిలు మని వీఁకఁ దాఁకె నిర్జర నాథున్.
8-360-క.
పంచానన వాహనుఁడై
చంద్గద జంభుఁ డెత్తి శైలారిని దాఁ
కించి సురేభంబును నొ
ప్పించి విజృంభించి యార్చిపేర్చెం గడిమిన్.
8-361-క.
వీఁ చెడి ఘనగదాహతిఁ
దోఁయు గదలింపలేక దుస్సహపీడన్
మోఁరిలఁ బడియె నేలను
సోఁ కోర్వక దిగ్గజంబు సుడిసుడి గొంచున్.

టీకా:
            చెలికాని = స్నేహితుని; పాటు = పడిపోవుటను; కనుగొని = చూసి; బలి = బలి యొక్క; సఖుడు = స్నేహితుడు; అగు = అయిన; జంభుడు = జంభుడు; అతుల = అధికమైన; బాహాశక్తిన్ = భుజబలముతో; చెలితనమున్ = స్నేహమును; చాలన్ = ఎక్కువగా; నెఱపుచున్ = చూపించుచూ; నిలునిలుము = ఆగుము; అని = అని; వీకన్ = విజృంభించి; తాకెన్ = ఎదుర్కొనె; నిర్జరనాథున్ = ఇంద్రుని.
            పంచానన = సింహమును; వాహనుడు = వాహనముగాగలవాడు; ఐ = అయ్యి; చంచత్ = మెరుపులాంటి; గదన్ = గదను; జంభుడు = జంభుడు; ఎత్తి = పైకెత్తి; శైలారినిన్ = ఇంద్రుని; తాకించి = ఎదిర్చి; సురేభంబును = ఐరావతమును; నొప్పించి = కొట్టి; విజృంభించి = విజృభించి; ఆర్చి = కేకపెట్టి; యార్చెన్ = చఱిచెను; కడిమిన్ = పరాక్రమముతో.
            వీకన్ = ఉత్సాహము; చెడి = కోల్పోయి; ఘన = మిక్కిలి పెద్ద; గదా = గద యొక్క; హతిన్ = దెబ్బకి; తోకయును = తోకకూడ; కదలింప = కదిలించుటకు; లేక = రాక; దుస్సహ = సహింపరాని; పీడన్ = బాధతో; మోకరిలపడియెన్ = మోకాళ్ళమీదకూలెను; నేలను = నేలమీద; సోకున్ = తాకిడిని; ఓర్వక = తట్టుకొనలేక; దిగ్గజంబు = ఐరావతము; సుడిసుడిగొంచున్ = గిరగిరతిరిగిపోతూ.

భావము:
          జంభుడు అనే రాక్షసుడు తన చెలికాడు అయిన బలిచక్రవర్తి పడిపోవడం చూసి; తన స్నేహాన్న ప్రకటింపజేస్తూ సాటిలేని పరాక్రమంతో దేవతల ప్రభువు అయిన ఇంద్రుని నిలు నిలు అంటూ ఎదిరించాడు.
          అలా సింహాన్ని వాహనంగా చేసుకుని వచ్చిన జంభాసురుడు గదను పైకెత్తి పరాక్రమంతో పర్వతాల గర్వం అణచిన ఇంద్రుని పైకి విజృంభించాడు. కేకలు వేస్తూ సురలోకపు గజేంద్రము అయిన ఐరావతాన్ని ఒక్క చరుపు చరిచి రెచ్చిపోయాడు.
          జంబాసురుని ఆ క్రూరమైన గదాఘాతంతో ఐరావతం ఉత్సాహాం కోల్పోయింది. భరించ లేనంతటి బాధతో తిరిగి తోకను కూడా కదలించ లేక నేలపై ముందుకు వాలిపోయింది.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: