Friday, September 16, 2016

క్షీరసాగరమథనం – అసురుల మాయ

8-343-చ.
సురుల మాయ లన్నియును బ్జదళాక్షుఁడు వచ్చినంతటన్
సిబిసియై నిరర్థమయి గ్రక్కునఁ బోయెను; నిద్రబొంది సం
మున మేలుకొన్నగతిఁ దాల్చి చెలంగిరి వేల్పు లందఱుం
 చెడ కేలయుండు హరిపాద పరిష్కృతిచేయ నాపదల్?
8-344-వ.
అయ్యెడ

టీకా:
          అసురుల = రాక్షసుల యొక్క; మాయలు = మాయలు; అన్నియునున్ = అన్నీ; అబ్జదళాక్షుడు = విష్ణువు; వచ్చినంతటన్ = రాగా; కసిబిసి = కకావికలు; ఐ = అయ్యి; నిరర్థము = వ్యర్థము; అయి = అయ్యి; క్రక్కున = వెంటనే; పోయెన్ = విరిగిపోయినవి; నిద్ర = నిద్ర; పొంది = పోయి; సంతసమునన్ = సంతోషముతో; మేలుకొన్న = నిద్రలేచిన; గతిన్ = విధముగ; తాల్చి = పూని; చెలంగిరి = చెలరేగిరి; వేల్పుల్ = దేవతలు; అందఱున్ = సర్వులు; పసచెడక = పట్టువిడిపోకుండగ; ఏల = ఎలా; ఉండున్ = ఉండగలుగును; హరి = విష్ణుని; పాద = పాదాశ్రయముచేత; పరిష్కృతిన్ = పరిష్కారము; చేయన్ = చేయబడినట్టి; ఆపదల్ = కష్టములు.
          ఆ = ఆ; ఎడన్ = సమయమునందు.

భావము:
           అలా కమలాల వంటి కన్నులు గల విష్ణువు రాగానే, ఆ రాక్షసుల మాయలు అన్నీ కకావికలైపోయి, పనికిరాకుండాపోయి, విరిగిపోయాయి. దేవతలు అందరూ అప్పుడే నిద్ర మేల్కొన్న విధంగా చెలరేగారు. పురుషోత్తముని పాదాశ్రయంతో పరిష్కరింపబడిన ఆపదల పట్టులు విడిపోతాయి కదా.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: