Sunday, August 28, 2016

క్షీరసాగరమథనం – శ్రోణీభర కుచయుగ

8-313-క.
శ్రోణీభర కుచయుగ భర
వేణీభరములను డస్సి వివిధాభరణ
క్వా యయి యువిద వచ్చెను
బాణి సరోజమున నమృతభాండముఁ గొంచున్.
8-314-క.
భాసుర కుండల భాసిత
నాసాముఖ కర్ణ గండ యనాంచల యై
శ్రీతి యగు సతిఁ గని దే
వాసుర యూధంబు మోహ మందె నరేంద్రా!

టీకా:
            శ్రోణీ = కటి; భర = బరువుతోను; కుచ = స్తనముల; యుగ = ద్వయము; భర = బరువుతోను; వేణీ = శిరోజముల; భరములను = బరువుతోను; డస్సి = అలసిపోయి; వివిధ = అనేకరకముల; ఆభరణ = నగల యొక్క; క్వాణ = ధ్వనులుగలది; అయి = ఐ; ఉవిద = మగువ; వచ్చెను = అరుదెంచెను; పాణి = చేతులు యనెడి; సరోజమునన్ = పద్మమునందు; అమృత = అమృతపు; భాండమున్ = పాత్రను; కొంచున్ = తీసుకొని.
            భాసుర = కాంతివంతమైన; కుండల = చెవికుండలములచే; భాసిత = ప్రకాశింపచేయబడిన; నాసా = ముక్కు; ముక్కు = ముక్కు; కర్ణ = చెవులు; గండ = చెక్కిళ్ళు; నయనాంచల = కనుకొనలుగలది; ఐ = అయ్యి; శ్రీసతి = లక్ష్మీదేవి; అగు = అయిన; సతిన్ = సతీదేవిని; కని = చూసి; దేవా = దేవతల; అసుర = రాక్షస; యూధంబున్ = సమూహము; మోహము = మాయలో; అందెన్ = పడెను; నరేంద్రా = రాజా.

భావము:
            అప్పుడు, కటిభారంతోనూ, స్తనాలభారంతోనూ, శిరోజాలభారంతోనూ చిక్కిన చక్కనమ్మ జగన్మోహిని, తన పద్మం వంటి చేతిలో అమృతకలశాన్ని పట్టుకుని ఒయ్యారంగా వచ్చింది. ఆమె ధరించిన రకరకాల ఆభరణాలు సవ్వళ్ళు చేస్తున్నాయి.
పరీక్షిత్తూ! రాజా! ఆ మోహినీ అవతారం, ధరించిన కర్ణాభరణాల తళతళ మెరుపులు, ఆమె ముక్కుకూ, ముఖానికీ, చెవులకూ, చెక్కిళ్ళకూ, కనుగొనలకూ మనోహరంగా వ్యాపిస్తున్నాయి. అలా లక్ష్మీదేవితో సాటిరాగల ఆ అందగత్తెను చూసిన దేవతలకూ, రాక్షసులకూ అందరికీ మనసు చెదిరిపోయింది.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: