Friday, August 19, 2016

క్షీరసాగరమథనం – ఒకని చేత నుండ

8-299-ఆ.
కని చేత నుండ నొకఁడు బలిష్ఠుఁడై
పుచ్చికొనిన వానిఁ బొదుగఁ బట్టి
యంతకంటె నధికుఁ మృత కుంభము నెత్తి
కొంచుఁ బాఱెఁ బరులుఁ గుయ్యిడంగ.

టీకా:
            ఒకని = ఒకతని; చేతన్ = చేతులో; ఉండన్ = ఉండగా; ఒకడు = మరొకతను; బలిష్టుడు = బలముకలవాడు; ఐ = అయ్యి; పుచ్చికొనిన = తీసుకొనగా; వానిన్ = అతనిని; పొదుగన్ = చుట్టుముట్టి; పట్టి = పట్టుకొని; అంతకంటెన్ = అంతకంటెను; అధికుండు = ఎక్కువగలవాడు; అమృత = అమృతపు; కుంభమున్ = పాత్రను; ఎత్తికొంచు = లాక్కొని; పాఱెన్ = పరుగిడెను; పరులు = ఇతరులు; కుయ్యిడంగన్ = మొత్తుకొనగా;

భావము:
            ఒకడి చేతిలో ఉన్న అమృతకలశాన్ని ఇంకొక బలవంతుడు లాక్కున్నాడు. వాని కంటె బలవంతుడు ఒడిసి పట్టి లాక్కుని, పారిపోయాడు. తక్కినవారు అరిచారు.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: