Tuesday, August 16, 2016

క్షీరసాగరమథనం – తరుణుండు

అష్టమ స్కంధముధన్వంతరి అమృతం జననము
8-292-వ.
మఱియుం దరువం దరువ న ప్పయోరాశి యందు.
8-293-సీ.
రుణుండు దీర్ఘ దోర్దండుండు గంబుకం
రుఁడు పీతాంబరధారి స్రగ్వి
లాసిత భూషణాలంకృతుం డరుణాక్షుఁ
డున్నతోరస్కుఁ డత్యుత్తముండు
నీలకుంచిత కేశ నివహుండు జలధర
శ్యాముండు మృగరాజ త్త్వశాలి
ణికుండలుఁడు రత్నమంజీరుఁ డచ్యుతు
నంశాంశ సంభవుం మలమూర్తి
8-293.1-ఆ.
భూరియాగభాగ భోక్త ధన్వంతరి
నఁగ నమృత కలశ స్తుఁ డగుచు
నిఖిలవైద్యశాస్త్ర నిపుణుఁ డాయుర్వేది
వేల్పు వెజ్జుఁ గడలి వెడలి వచ్చె.

టీకా:
            మఱియున్ = ఇంకను; తరువంతరువన్ = చిలుకగాచిలుకగా; ఆ = ఆ; పయోరాశి = సముద్రము; అందున్ = లో.
            తరుణుండు = ప్రాయములోనున్నవాడు; దీర్ఘదోర్దండుడున్ = ఆజానుబాహుడు; కంబు = శంఖమువంటి; కంధరుడు = కంఠముగలవాడు; పీత = పట్టు; అంబర = బట్టను; ధారి = ధరించినవాడు; స్రక్ = పూలదండలుతో; విలాసిత = విలసిల్లుతున్న; భూషణ = ఆభరణములు; అలంకృతుండున్ = అలంకరింపబడినవాడు; ఉన్నత = ఎత్తైన; ఉరస్కుడు = ఎదగలవాడు; అతి = మిక్కలి; ఉత్తముండు = ఉత్తముడు; నీల = నల్లని; కుంచిత = వంకీల; కేశ = శిరోజముల; నివహుండు = సమూహముగలవాడు; జలధర = మేఘమువంటి; శ్యాముండు = నల్లనిదేహముగలవాడు; మృగరాజ = సింహమువంటి; సత్త్వశాలి = శక్తిగలవాడు; మణికుండలుడు = మణులు పొదిగిన కుండలములుగలవాడు; రత్నమంజీరుడు = రత్నాల అందెలవాడు; అచ్యుతున్ = విష్ణుని; అంశ = అంశతోపుట్టిన; అంశసంభవుండు = అవతారుడు; అమలమూర్తి = స్వచ్చమైన స్వరూపుడు
            భూరి = అతిపెద్ద; యాగ = హవిస్సులందలి; భాగ = భాగమును; భోక్త = పొందువాడు; ధన్వంతరి = ధన్వంతరి; అనన్ = అనెడి పేరుగలవాడు; అమృత = అమృతపు; కలశ = పాత్ర; హస్తుడు = చేత ధరించినవాడు; అగుచున్ = అగుచు; నిఖిల = సర్వ; వైద్యశాస్త్ర = వైద్య శాస్త్రవిషయముల; నిపుణుడు = నేర్పుగలవాడు; ఆయుర్వేది = ఆయుర్వేదకర్త; వేల్పు = దేవతలకు; వెజ్జు = వైద్యుడు; కడలిన్ = సముద్రమునుండి; వెడలి = బయటకు; వచ్చె = వచ్చెను.

భావము:
              అలా ఇంకా చిలకగా చిలకగా ఆ పాలసముద్రంలోంచి. . .
            అమృత కలశం చేత పట్టుకుని ధన్వంతరి అనే దివ్యపురుషుడు విష్ణువు అంశతో జనించి, ఆ పాల కడలిలోనుండి వెలుపలుకి వచ్చాడు. ఆ దివ్యపురుషుడు మంచి ప్రాయం కలవాడు; ఆజానుభావుడు; శంఖం వంటి కంఠమూ, ఎర్రని కళ్ళూ, ఎత్తైన రొమ్మూ, నల్లని తల వెంట్రుకలూ, మేఘవర్ణపు దేహమూ కలవాడు; పట్టువస్త్రాలూ, పూలమాల, మెరుస్తున్న నగలూ, మణులు పొదిగిన మకరకుండలాలూ, రత్నాల అందెలూ, మొదలైన అలంకారాలు ధరించిన వాడు; సింహం వటి శక్తియక్తులు కలవాడు. అతడు బహుయోగ్యుడు; పవిత్రమైన యజ్ఞాలలో హవిర్భాగాన్ని పొందువాడు; సమస్తమైన వైద్యశాస్త్రాలలోను ఆరితేరినవాడు; దేవతా ప్రముఖుడు.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: