Monday, July 25, 2016

క్షీరసాగరమథనం – సచ్చంద్రపాండురంబై

అష్టమ స్కంధము : ఉచ్చైశ్రవావిర్భవము

8-255-క.
చ్చంద్రపాండురంబై
యుచ్చైశ్రవ మనఁగ దురగ మొగి జనియించెం
బుచ్చి కొనియె బలి దైత్యుం
డిచ్చ గొనం డయ్యె నింద్రుఁ డీశ్వరశిక్షన్.
8-256-క.
 పగు నురమును బిఱుఁదును
నెఱిఁ దోఁకయు ముఖముసిరియు నిర్మలఖురముల్
కుచచెవులుఁ దెలిఁగన్నులు
చగు కందంబుఁ జూడఁ గు నా హరికిన్.
8-257-వ.
అంత నా పాలకుప్ప యందు.

టీకా:
            సత్ = స్వచ్ఛమైన; చంద్ర = చంద్రుని వంటి; పాండురంబు = తెల్లదనముగలది; ఐ = అయ్యి; ఉచ్ఛ్ర్రైశ్వము = ఉచ్ఛ్ర్రైశ్వము; అనగా = అనబడెడి; తురగము = గుర్రము; ఒగిన్ = ఒకటి; జనియించెన్ = పుట్టెను; పుచ్చుకొనియెన్ = తీసికొనెను; బలి = బలి యనెడి; దైత్యుండు = రాక్షసుడు; ఇచ్చన్ = కోరి; కొనండయ్యన్ = తీసుకొనుటలేదు; ఇంద్రుడు = ఇంద్రుడు; ఈశ్వర = నారాయణుని; శిక్షన్ = ప్రేరణవలన;
            ఒఱపు = దృఢమైన; ఉరమునున్ = రొమ్ము; పిఱుదునున్ = పిరుదులు; నెఱిన్ = నిండైన; తోకయున్ = తోక; ముఖము = ముఖము; సిరియు = శోభ; నిర్మల = స్వచ్ఛమైన; ఖురములున్ = గిట్టలు; కుఱుచ = పొట్టి; చెవులున్ = చెవులు; తెలి = తెల్లని; కన్నులున్ = కళ్ళు; తఱచు = దళసరిదైన; అగు = అయినట్టి; కందంబునున్ = కంఠము; చూడన్ = చూచుటకు; తగున్ = తగిననట్టివి; ఆ = ఆ; హరి = గుర్రమున (ఉచ్ఛైశ్రవమున); కిన్ = కు.
            అంతన్ = అంతట; ఆ = ; పాలకుప్ప = పాలసముద్రము; అందున్ = లో.

భావము:
            స్వచ్ఛమైన చంద్రుడిలా తెలుపు రంగు దేహంతో ఉచ్ఛైశ్రవము అనే గుఱ్ఱము పుట్టింది. దానిని బలిచక్రవర్తి తీసుకున్నాడు. భగవంతుని ప్రేరణతో ఇంద్రుడు ఇందుకు కాదన లేదు.
            ఆ ఉచ్ఛైశ్రవము అనే గుఱ్ఱమునకు చిక్కటి రొమ్ము, అందమైన పిరుదులు, చక్కటి తోక, సిరులుట్టిపడే ముఖము, గుండ్రని గిట్టలు, పొట్టి చెవులు, తెల్లటి శుభ్రమైన కళ్ళు, దళసరిగా ఉన్న మెడ చూడ ముచ్చటగా అమరి ఉన్నాయి. 
            అటుపిమ్మట ఆ పాలసముద్రంలో . . . 
            దుష్కర ప్రాస చ్చతో ఆ గుఱ్ఱము బహు ఉన్నతము, దుర్లభము అయినది అని సూచిస్తున్నారా. . రెండవ పద్యంలో గుఱ్ఱాన్ని వర్ణిస్తూ కార ప్రాస ప్రయోగం చక్కగా ఉంది.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: