Wednesday, July 20, 2016

క్షీరసాగరమథనం – ఉదరము


8-245-క.
రము లోకంబులకును
నం బగు టెఱిఁగి శివుఁడు టుల విషాగ్నిం
గుదురుకొనఁ గంఠబిలమున
దిలంబుగ నిలిపె సూక్ష్మలరసము క్రియన్.
8-246-క.
మెచ్చిన మచ్చిక గలిగిన
నిచ్చిన నీవచ్చుఁ గాక యిచ్చ నొరులకుం
జిచ్చుఁ గడిగొనఁగ వచ్చునె
చిచ్చఱరూ పచ్చుపడిన శివునకుఁ దక్కన్.
            మెచ్చిన = శ్లాఘించినచో; మచ్చిక = నచ్చుట; కలిగినన్ = కలిగినచో; ఇచ్చినన్ = ఇస్తే; ఈవచ్చు = ఇవ్వచ్చు; కాక = కాని; ఇచ్చన్ = ఇష్టపూర్తిగా; ఒరుల్ = ఇతరుల; కున్ = కు; చిచ్చున్ = అగ్నిని; కడిగొనగన్ = తినబోవుటకు; వచ్చునె = సాధ్యమా; చిచ్చఱ = అగ్నివంటిరౌద్రము; రూపచ్చుపడిన = మూర్తీభవించిన; శివున్ = శంకరుని; కున్ = కి; తక్కన్ = తప్పించి.
టీకా:
            ఉదరము = కడుపు; లోకంబుల్ = లోకముల; కును = కు; సదనంబు = నివాసము; అగుటన్ = అయ్య ఉండుటను; ఎఱిగి = తెలిసి; శివుడు = శంకరుడు; చటుల = భయంకరమైన; విష = విషము యొక్క; అగ్నిన్ = అగ్నిని; కుదురుకొనగన్ = కుదురుగానుండునట్లు; కంఠ = గొంతు యనెడి; బిలమునన్ = గుహ యందు; పదిలంబుగా = జాగ్రత్తగా; నిలిపెన్ = కదలకుండ ఉంచెను; సూక్ష్మ = చిన్న; ఫలరసము = పండురసము; క్రియన్ = వలె.
భావము:
            పరమేశ్వరుడి ఉదరం సమస్త లోకాలకూ నివాసం కనుక. ఆయన ఆ భీకరమైన విషాగ్నిని ఉందరంలోనికి పోనివ్వకుండా, ఏదో చిన్న పండ్ల రసాన్ని ఉంచుకున్నట్లుగా, తన కంఠ బిలంలో కుదురుగా ఉండేలా జాగ్రత్తగా నిలుపుకున్నాడు.
            మెచ్చినప్పుడూ, నచ్చినప్పుడూ ఇచ్చవచ్చినంత ఎవరికైనా ఇవ్వవచ్చు. కానీ; ఇతరుల కోసం భగభగ మండే చిచ్చును కోరి కబళంచేసి మింగటం అన్నది, ఆ చిచ్చర కన్ను గల పరమ శివుడైన హరునికి తప్పించి ఎవరికి సాధ్యం అవుతుంది?

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: