Thursday, June 9, 2016

క్షీరసాగరమథనం – పగవారు

8-180-వ.
అటు వారించి వైరోచని రాక్షస సముదయంబున కిట్లనియె.
8-181-క.
వారు శరణు చొచ్చిన
తనములు నెఱపఁ దగునె గవారలకున్
గు సమయ మెఱుఁగ వలదే
టిమిఁ బాటింప వల దర్త్యులతోడన్.
టీకా:
            అటు = అలా; వారించి = అడ్డుకొని; వైరోచని = బలి {వైరోచని - విరోచనుని పుత్రుడు, బలి}; రాక్షస = రాక్షసుల; సముదయంబున్ = సమూహమున; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
            పగవారు = శత్రువులు; శరణు = శరణు; చొచ్చినన్ = వేడినప్పుడు; మగతనములు = పౌరుషములను; నెఱపన్ = చూపుట; తగునె = తగునా, తగదు; మగవారల = పరాక్రమశాలుల; కున్ = కు; తగు = తగిన; సమయమున్ = సమయమును; ఎఱుగన్ = గమనించ; వలదే = వద్దా ఏమి; మగటిమన్ = బాహుబలముచూపుట; పాటింపన్ = చేయ; వలదు = వద్దు; అమర్త్యుల = దేవతల {అమర్త్యులు - చావులేనివారు, దేవతలు}; తోడన్ = తోటి.
భావము:
            అలా దేవతలను చంపవద్దని వారించి బలి, రాక్షస మూకలతో ఇలా అన్నాడు.
            “శత్రువులు బెదిరిపోయి శరణు వేడినప్పుడు పరాక్రమవంతులు తమ పౌరుషాలు చూపరాదు. తగిన సమయం గమనించాలి కదా! అందుచేత, ఇప్పుడు దేవతలపై మీ బాహుబలాన్ని ప్రకటించరాదు.”
८-१८०-व.
अटु वारिंचि वैरोचनि राक्षस समुदयंबुन किट्लनिये.
८-१८१-क.
पगवारु शरणु चोच्चिन
मगतनमुलु नेर्रपँ दगुने मगवारलकुन्
तगु समय मेर्रुँग वलदे
मगटिमिँ बाटिंप वल दमर्त्युलतोडन्.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: